రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై సర్వత్రా ఆగ్రహం

రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై సర్వత్రా ఆగ్రహం
రాముని విగ్రహం శిరస్సు తొలగించిన వారిని శిక్షించే వరకు రామతీర్థాన్ని వీడేది లేదని టీడీపీ, బీజేపీ, స్వామీజీలు ఆందోళనకు దిగారు.

విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆలయంలోని రాముని విగ్రహ తలభాగాన్ని వేరు చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ మండిపడింది. రామతీర్థం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా నాయకులు రాత్రంతా జాగరణ చేశారు. వణికించే చలిలోనూ నిరసన తెలియజేశారు. నిందితులను పట్టుకునేంత వరకు కొండపైనే నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాముని విగ్రహం శిరస్సు తొలగించిన వారిని శిక్షించే వరకు రామతీర్థాన్ని వీడేది లేదని టీడీపీ, బీజేపీ, స్వామీజీలు ఆందోళనకు దిగారు.

Tags

Next Story