జగన్ సర్కార్‌పై కమలనాథుల యుద్ధ భేరి..!?

జగన్ సర్కార్‌పై కమలనాథులు యుద్ధ భేరి మోగించినట్లేనా? నిన్నటి శ్రీకాళహస్తి సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. ఏకంగా ఏపీ గడ్డ అవినీతికి అడ్డా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నడ్డా వ్యాఖ్యలతో వైసీపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. మరి ఇవాళ్టి అమిత్ షా విశాఖ పర్యటనలో ఏం జరగబోతోంది? నడ్డా ప్రసంగానికి అమిత్ షా కొనసాగింపునిస్తారా? జగన్ సర్కార్‌ను కడిగిపారేస్తారా? అమిత్ షా నోటి నుంచి విమర్శల తూటాలు దూసుకువస్తాయా? ఫ్యాన్ పార్టీకి ముచ్చెమటలు తప్పవా? టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షాతో భేటీ అయిన తర్వాతే.. వైసీపీపీ బీజేపీ వైఖరి మార్చుకుందా? ఎన్టీఏను బలోపేతం చేసుకునే దిశగా కమలం పెద్దలు అడుగులేస్తున్నారా? అందులో భాగంగానే పాతమిత్రుల్ని దగ్గర చేసుకుంటున్నారా?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తి సభ వైసీపీ గుండెల్లో బాంబుల మోత మోగించింది. ఒకటా.. రెండా.. వరుసగా అవినీతి ఆరోపణలతో నడ్డా చాకిరేవు పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఏపీలో భూములు, గనులు, మద్యం స్కామ్‌లు జరుగుతున్నాయన్నారు. విద్య, ఇసుక, వైద్యం.. అన్నింట్లో అవినీతే అంటూ తేల్చేశారు. దేశంలోనే వైసీపీ అతిపెద్ద అవినీతి పార్టీ అన్న నడ్డా.. వైసీపీ పాలనలో అవినీతికే పెద్దపీట వేస్తోందన్నారు. పాలనను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి ఏమైందని నిలదీసిన నడ్డా.. ఏపీకి రాజధాని లేకపోవడం విచారకరమన్నారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య ఉందనీ అన్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతుంటే కేంద్రం ప్రేక్షకపాత్ర వహించదని హెచ్చరించిన నడ్డా.. బీజేపీ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com