Bonda Uma : దుర్గగుడిలో భారీ దోపిడీ జరగబోతోంది : బోండా ఉమ

Bonda Uma : రాబోయే దసరా ఉత్సవాల్లో దుర్గగుడిలో భారీ దోపిడీ జరగబోతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ. మాజీ మంత్రి వెల్లంపల్లి.. భారీగా డబ్బు కొట్టేయడానికి స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పవిత్రమైన కనకదుర్గ గుడిలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అమ్మవారి ఆదాయాన్ని దోచుకున్న వెల్లంపల్లికి.. పదవి పోయినా అతని అనుచరులు ఆగడాలు కొనసాగిస్తున్నారన్నారు.
వెల్లంపల్లి మాఫియా.. ఒకే టిక్కెట్ నెంబర్‌పై 10 దర్శనం టిక్కెట్లు ముద్రించి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 20 గ్రాముల లోపు బంగారం కానుకగా ఇస్తే రశీదు ఇవ్వకుండా దోచుకుంటున్నారన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న దోపిడీపై స్పెషల్ ఆఫిసర్‌ను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com