AP: హైకోర్టు సీరియస్... లొంగిపోయిన బోరుగడ్డ

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ గడువు మంగళవారంతో ముగిసినా లొంగిపోలేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు హైకోర్టుకు సమాచారాన్ని అందించారు. అటు మధ్యంతర బెయిల్ పొడిగించాలని అనిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పొడిగించేందుకు నిరాకరించింది. సమయం ముగిసినా లొంగిపోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. త్వరగా లొంగిపోవాలని మంగళవారం అనిల్‌కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే చెన్నై నుంచి విమానంలో రాజమండ్రి వచ్చి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. దీంతో అనిల్ జైలులో లొంగిపోయాడు.
షాక్ ఇచ్చిన హైకోర్టు
నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌తో బురిడీ కొట్టించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిలును పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిలును పొడిగించే ప్రసక్తే లేదని, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో బోరుగడ్డ అనిల్ కోర్టులో లొంగిపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com