విజయనగరంలో మంత్రి బొత్స ఇంటిముట్టడికి తరలివచ్చిన విద్యార్ధులు

X
By - Nagesh Swarna |13 Oct 2020 5:29 PM IST
మహారాజా కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టిడించారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్ధులు మంత్రి ఇంటిముందు ఆందోళన చేపట్టారు. మాన్సాస్ సంస్థ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నినాదాలు చేశారు. కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా నిరసన తెలియజేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్ల అడ్డుతొలగించుకొని ముందుకు దూసుకొస్తున్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్ధి నాయకులను అరెస్టుచేసి స్టేషన్ కు తరలించారు. ఎన్ని అరెస్టులుచేసినా తమపోరాటం ఆగదని విద్యార్ధి సంఘం నాయకులు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com