బొత్స ఇల్లు ముట్టడి

మహారాజా కళాశాలను ప్రైవేటీకరించొద్దంటూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర లేరు. దీంతో బొత్సతో ఫోన్లో మాట్లాడించారు ఆయన సతీమణి బొత్స ఝాన్సీ. ఎం.ఆర్. కాలేజీ వివాదం తనకు తెలుసని, తను కూడా ఆ కాలేజీ పూర్వ విద్యార్థినేనన్నారు బొత్స. కలెక్టర్‌కి కూడా వినతిపత్రం అందించాలని బొత్స.. ఏబీవీపీ కార్యకర్తలకు సూచించారు. ఇక ప్రజల ఆందోళనలను, ఆకాంక్షలను మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైత అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని ఏబీవీపీ కార్యకర్తలతో అన్నారు బొత్స ఝాన్సీ. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు శాంతించారు.
Next Story