కృష్ణాజిల్లాలో దారుణం.. యువకుడు మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు

కృష్ణాజిల్లాలో దారుణం.. యువకుడు మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి

ఏపీలో మహిళలకు రక్షణ లేకండా పోతోందని టీడీపీ నేతలు, విపక్షాలు మండిపడుతున్నాయి.. తాజాగా కృష్ణా జిల్లాలో దళిత యువతిపై సాయి రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు..కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం ఈ ఘటన చోటు చేసుకుంది.. వడాలికి చెందిన యువకుడు సాయి రెడ్డి తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ సాయిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే నిరాకరిస్తున్నాడని.. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని యువతి చెప్పింది. అయితే అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. తనకు అధికార పార్టీ మద్దతు ఉందని సాయి రెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడని యువతి ఆరోపించింది. ఇప్పుడు కేసు ఉపసంహరించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఉండగానే.. గుర్తు తెలియని కొందరు దుండగులు ఇంటికి నిప్పు పెట్టారని ఆమె ఆరోపించింది.

వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వైసీపీనేతల అండదండలతో దారుణాలు జరుగుతున్నాయన్నారు. కృష్ణా జిల్లా మదనపల్లిలో దళిత యువతిని సాయిరెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించాడని, పెళ్లిచేసుకోవాలని యువతి కోరడంతో కక్షకట్టాడన్నారు.

Tags

Read MoreRead Less
Next Story