తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సేఫ్

తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సేఫ్
కిడ్నాపైన బాలుడు శివకుమార్ కేసులో కాస్త పురోగతి కనిపిస్తోంది.

తిరుపతిలో గత నెల 27న కిడ్నాపైన బాలుడు శివకుమార్ కేసులో కాస్త పురోగతి కనిపిస్తోంది. ఎస్‌.కోటకు చెందిన శివప్ప ఈ పిల్లాడికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవలే అనారోగ్యంతో శివప్ప కొడుకు చనిపోయాడు. ఈ నేపథ్యంలో పెంచుకునేందుకు ఓ అబ్బాయిని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించి, పథకం ప్రకారమే శివకుమార్‌ను ఎత్తుకెళ్లినట్టు చెప్తున్నారు. పిల్లాడిని తీసుకువెళ్తున్న విజువల్స్‌ CC ఫుటేజ్‌లో రికార్డ్ అవడంతో వాటి ఆధారంగా కిడ్నాపర్‌ను గుర్తించేందుకు ప్రయత్నించి చివరికి అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. S.కోటకు వెళ్లి వారిని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.
Tags

Next Story