HARISH: తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలా..?

HARISH: తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలా..?
X
గరీబీ హటావోనా.. గరీబోంకో హటావోనా అని ప్రశ్నించిన హరీశ్ రావు... బుల్డోజర్ రాజ్యం ఆపాలని డిమాండ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలకు తెర తీసిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పేదలకు కనీస వసతులు కల్పించడమా.. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమా.. ప్రభత్వానికి ఏది ముఖ్యమని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారని.. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం గరీబోంకో హటావో అంటుందని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందన్నారు. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్నారని, ఏడు నెలల నుంచి పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బు లేదని అంటున్నారని, పెద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవని చెబుతున్నారు కానీ మూసి ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్ల రూపాయలు పెడతా మంటున్నారని ఎద్దేవా చేశారు. పథకాలకు పైసలు లేవు కానీ.. ఇళ్లు కూలగొడతారా అని హరీశ్ ప్రశ్నించారు. పెద్దల జోలికి వెళ్లడం లేదు కానీ.. పేదల ఇళ్లు కూలుస్తున్నారన్నారు. అవసరమైతే కాలనీకి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హరీష్ రావు భరోసా ఇచ్చారు.


బాధితులకు అండగా బీఆర్ఎస్

బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బండ్లగూడ, హైదర్ షా కోట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి మూసీ బాధితులను పరామర్శించి సమస్యలు విన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ముందు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేకుండా పోయాయని, రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలనలా .. పిచ్చోడి చేతిలో రాయి లా తయారైందని హరీష్ రావు అన్నారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు‌‌ .. ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. హైడ్ర పేరుతో పేదల మెడమీద కత్తి పెట్టి ఖాళీ చేయిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌పై దృష్టి పెట్టారని ఆరోపించారు. వైరల్ ఫీవర్ కారణంగా ఎమ్మెల్యేల పర్యటనకు కేటీఆర్ దూరంగా ఉన్నారు.

రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చొద్దు

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్‌పై బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైదర్శకోటలోఇళ్లు కూల్చొదంటూ భాదిత కుటుంబాలు, చిన్నారులు నిరసన తెలిపారు. మా ఇల్లు మాకు కావాలి.. ప్లీజ్ హెల్ప్ చేయండి.. అని ఓ చిన్నారి మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైడ్రా ప్లీజ్ మా ఇళ్లు కూల్చొద్దంటూ చిన్నారి విజ్ఞప్తి చేసింది.

Tags

Next Story