Amaravathi : ఇక పరుగులు పెట్టనున్న అమరావతి అభివృద్ధి

Amaravathi : ఇక పరుగులు పెట్టనున్న అమరావతి అభివృద్ధి
X
ప్రజారాజధానికి మహర్దశ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.8,821.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక అమరావతి అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుందని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు తెలిపారు. అమరావతిలో రోడ్ల నిర్మాణంపై సీఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. మంజూరైన నిధులతో అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూమిని సేకరించిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.3,807 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 4,521 కోట్లతో ట్రంక్ రోడ్లు వేస్తామని, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణానికి రూ.492 కోట్లు కేటాయించామని నారాయణ తెలిపారు.

ఇప్పటికే ఆమోదముద్ర

సీఆర్‌డీఏ గత సమావేశాల్లో రూ.11,471 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది. మరో సమావేశం తర్వాత అది రూ.20,292.46 కోట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల పరిధిలో 236 కి.మీ మేర లేఅవుట్లు, 97.5 కి.మీ మేర ట్రంక్ రోడ్లు మంజూరయ్యాయని మంత్రి నారాయణ వెల్లడించారు. 2014 నుంచి 2019 వరకు రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అయితే రూ. 5 వేల కోట్లతో పనులు పూర్తయ్యాయని, దీంతో నిర్మాణ వ్యయం పెరిగిందని, దీంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నారాయణ అన్నారు. పనులు కొనసాగించడంలో ఈ జాప్యం వల్ల 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని, భవనాల నిర్మాణ వ్యయం 35 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని చెప్పారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి అనుమతిస్తే అభివృద్ధి పనుల వ్యయం 45 శాతం పెరిగి ఉండేది కాదన్నారు. ఆమోదించిన ఈ అభివృద్ధి పనులకు డిసెంబర్ 15లోగా టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

నదుల అనుసంధానం

నదుల అనుసంధానం చేపడితే.. ఒక ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి.. నాలుగేళ్లు కరువు వచ్చినా తట్టుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. జల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. గడచిన ఐదేళ్లలో డ్యాములు, కాలువల యాజమాన్య నిర్వహణ జరగలేదు. గేట్ల మరమ్మతులు పూర్తిగా వదిలేశారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే తిరిగి అమర్చేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపడుతోంది. జలాలు వృథా కాకుండా కాపాడుతున్నాం. రిజర్వాయర్లను నీటితో నింపాం. వచ్చే రెండు సీజన్లలో కనీసం 8మీటర్ల మేర భూగర్భజలాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.

Tags

Next Story