Buggana: విశాఖ ఒక్కటే రాజధాని

మూడు రాజధానులపై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన హాట్ కామెంట్స్ చేశారు. 3 రాజధానులు మిస్ కమ్యూనికేషన్ అన్న ఆర్ధిక మంత్రి విశాఖ ఒక్కటే రాజధాని అని క్లారిటి ఇచ్చేశారు. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపుల్ సీట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గుంటూరులో ఓ సారి మాత్రమే అసెంబ్లీ భేటీ అవుతుందని, అంతమాత్రాన అన్నీ రాజధానులు కావని మంత్రి అంటున్నారు.
బెంగళూరులో మంత్రి బుగ్గన వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఏమాత్రం తమకు అనుకూలమైన నిర్ణయం వెలువడినా హుటాహుటిన విశాఖ తరలి వెళ్లేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారు. మళ్లీ 'మూడు రాజధానుల' బిల్లు పెట్టకుండా రాజధాని 'మార్పు' అనే పదం ప్రయోగించకుండా 'కార్యాలయ తరలింపు' అంటూ అమరావతిలో ఉన్న ఆఫీసులను విశాఖకు తరలించే అవకాశముందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పేరుకు అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటున్నప్పటికీ అమరావతి నుంచి రాజధానిని తరలించడమే ప్రభుత్వ పెద్దల ఉద్దేశంలా కనిపిస్తోందని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com