వసూల్ రాజా..ప్రైవేట్ ముఠా..!

వసూల్ రాజా..ప్రైవేట్ ముఠా..!
.అలీబాబా 40 దొంగలు తీరుగా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారశైలి ఉందని నిర్మాణదారులు మండిపడుతున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా పటమటలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాయాజాలం వెలుగు చూసింది.నిర్మాణదారుల నుంచి వసూళ్లకు ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్న ఉదంతం అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది.. ప్రైవేటు సైన్యం ఆధ్వర్యంలో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది.ఒకసారి ఏసీబీ దాడిలో పట్టుబడిన సదరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదు.ఈ వసూళ్ల దందాతో నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు.అలీబాబా 40 దొంగలు తీరుగా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారశైలి ఉందని నిర్మాణదారులు మండిపడుతున్నారు.ఇక బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను కట్టడి చేయడంలో మున్సిపల్‌ ఉన్నతాధికారులు కూడా విఫలమైనట్లుగా తెలుస్తోంది.అయితే, ఉన్నతాధికారుల మౌనం వెనుక నెలవారీ ముడుపుల వ్యవహారం ఉన్నట్లుగా పటమటలో ప్రచారం జరుగుతోంది.నెలనెలా ఠంచనుగా మామూళ్లు అందుతున్నందునే ఉన్నతాధికారులు సదరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్రమాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story