రోడ్డుపై ఊడిన బస్సు వెనుక చక్రాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

రోడ్డుపై ఊడిన బస్సు వెనుక చక్రాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై గోతుల్లోపడి బస్సుచక్రాలు ఊడిపోయాయి. వేగంగా వస్తున్న బస్సు గుంతలో పడి వెనుకచక్రాలు ఊడి పడ్డాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యహహరించడంతో... బస్సులో ఉన్న 15మంది ప్రయాణీకులకు ప్రమాదం తప్పింది. కట్ ప్లేట్లు విరిగి వెనుక చక్రాలు పది అడుగుల దూరంలో దూసుకెళ్లాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు రావులపాలెం మీదుగా నరసాపురం వెళులుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story