30 అడుగుల ఎత్తు నుండి నదిలో పడిపోయిన బస్సు

30 అడుగుల ఎత్తు నుండి నదిలో పడిపోయిన బస్సు
X

విశాఖ జిల్లా ఎస్‌రాయవరం మండలం పెనుగొల్లు వద్ద.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. తమిళనాడుకి చెందిన బస్సు చెన్నై నుండి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది..30 అడుగుల ఎత్తు నుండి వరాహ నదిలో పడిపోయింది బస్సు. అయితే ఆసమయంలో బస్సులో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సులో ఉన్న ముగ్గురిని బయటకు తీశారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story