BY ELECTIONS: వైఎస్ కంచుకోటలో ఉప ఎన్నికలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పులివెందుల, ఒంటి మిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోలింగ్ ఆరంభమైంది. రెండు మండలాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతోంది. పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలుకు చేరుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ క్యాస్టింగ్‌తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్‌తో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పులివెందులలో అన్ని సమస్యాత్మకమే
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీస్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10 వేల 600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24 వేల మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తుండగా ఇప్పటికే రెండు మండలాల్లోని ఓటర్లకు స్లిప్పులు అందజేసే ప్రక్రియ పూర్తయింది. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఘర్షణలు తలెత్తడంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు. రెండు ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వెబ్‌క్యాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పులివెందులలో పోలింగ్ బూత్‌లన్నింటినీ సున్నితమైనవిగా ప్రకటించారు. అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయస్తున్నారు. ఒంటి మిట్టలో వెబ్‌కాస్టింగ్ లేని కేంద్రాల్లో మైక్రో-ఆబ్జర్వర్స్ ను నియమించారు. APSP బాటాలియన్స్, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలు, డ్రోన్స్, క్లస్టర్ ఆధారిత పోలీస్ పర్యవేక్షణతో సహా అన్ని స్థాయిల్లో భద్రతా పటిష్టంగా చేశారు. పులివెందుల పట్టణం మున్సిపాలిటీగా ఉంది. అలాగే ఒంటిమిట్ట మండలంలో 13 గ్రామ పంచాయతీలు, 24,606 ఓటర్లు ఉన్నారు. పులివెందుల నుంచి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది. చనిపోయిన వైసీపీ నేత కుటుంబానికి అండగా ఉన్నాం అన్న భరోసా కల్పిస్తూ ఈ టికెట్ కేటాయించినట్లు స్పష్టం చేస్తోంది.
పటిష్ట చర్యలు తీసుకున్నాం: కలెక్టర్
'గత ఎన్నికలలో జరిగినటువంటి అంశాలు అన్నీ, అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఆధారంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దుల్లో 15 చెక్‌పోస్టులు ఉన్నాయి. ఆ 15 చోట్ల వెబ్‌క్యాస్టింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. ఒంటిమిట్టలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వెబ్ క్యాస్టింగ్ ఇవ్వలేదో అక్కడ మైక్రో అబ్జర్వర్స్న్ని నియమించడం జరిగింది.' అని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.
పటిష్ట బందోబస్తు: ఎస్పీ
ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లాలోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ ముగిసేవరకు స్థానికేతరులెవరూ ఉండకూడదని హెచ్చరించారు. 'ఒక ప్రాంతం నుంచి దాదాపు 5 లేదా 6 పోలింగ్ బూత్‌లను కలుపుతూ రూట్ మొబైల్స్‌గా డివైడ్ చేశాం. ఆ రూట్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలను కవర్ చేస్తూ టీమ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశాం. పులివెందుల, ఒంటిమిట్ట రెండు మండలాలకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసాం. ఓటు వేయ్యాలంటే కచ్చితంగా ఆ చెక్‌పోస్టులను దాటుకునే వెళ్లాలి.' అని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.
వైసీపీ పిటిషన్ తిరస్కరణ
అంతకు ముందు పోలింగ్ బూత్‌లను వేరే చోట ఏర్పాటు చేశారంటూ హైకోర్టులో వైసీపీ వేసిన పిటిషన్ పై విచారమ జరిగింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పోలింగ్ బూత్‌ల మార్పులో జోక్యాన్ని ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలని అవి ఓటర్లకు దూరంగా ఉన్నాయని లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్లో కోరారు. అయితే పోలింగ్ ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో ఇలా మార్చడం సాధ్యం కాదని ఎస్ఈసీ లార్లుస్పష్టం చేశారు. దీంతో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com