ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతున్న కాబినేట్ మీటింగ్

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించనుంది.ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీ కీలకంగా మారనుంది.ఇందులో ఉద్యోగుల సమస్యలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఓపీఎస్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కల్గించే అంశంపై చర్చించనున్నారు. 12వ పీఆర్సీపై ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది.పలు పరిశ్రమలు, సంస్థల భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.అమ్మఓడి, విధ్యాకానుక అమలు పథకాలకు పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపే యోచనలో ఉంది.
సిపియస్ ఉద్యోగులకు జిపియస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే రిటైరయ్యేనాటికి ఉన్న మూలవేతనంలో 50శాతం పెన్షన్ చెల్లించేవిదంగా మార్పులు చేయనున్నారు. ప్రభుత్వం ఈ కాబినెట్ మీటింగ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో పాటే 2014 జూన్ 2 నాటికి 5 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com