రెండు నిమిషాల్లో క్యాన్సర్ చికిత్స.. అత్యాధునిక రేడియేషన్ థెరపీ..

రెండు నిమిషాల్లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేసి రోగులకు ఉపశమనం కలిగించవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ సీఈవో డాక్టర్ వేమూరి విజయ్‌కుమార్ తెలిపారు. పెదకాకానిలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో (బొమ్మిడాల క్యాన్సర్ ఆస్పత్రి) అత్యాధుని రేడియేషన్ థెరపీ ద్వారా వేరియన్ హెల్పియాన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
క్యాన్సర్ పేషెంట్లకు రేడియేషన్ చికిత్స ప్రధానమైనది. ఇది కచ్చితంగా అందించడం ద్వారా దుష్ర్పభావాలను నియంత్రించవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్ నిర్మూలనే ధ్యేయంగా తమ ఆస్పత్రి పని చేస్తుందని అన్నారు. ఆస్సత్రి సీఈవో డాక్టర్ విజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం రేడియేషన్ పరికరాన్ని ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com