Aghori's : అఘోరీ కారుకు ప్రమాదం

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నాగసాధు అఘోరీ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీనిపై అఘోరీ స్పందిస్తూ.. తనకు ఏమి కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. వీధిలైట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. అయితే అఘోరీ కారు డివైడర్ ను ఢీొట్టింది. ప్రమాదంపై అఘోరీ స్పందిస్తూ.. తనకు ఏమీ కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. తన కారుకు లైట్లు వెలగడం లేదని, మెకానిక్ వచ్చే వరకు ఆగాలని చెప్పినప్పటికి పోలీసులు వినిపించుకోకుండా తనను వెళ్ళిపోమని బలవంతం చేశారని, ప్రమాదానికి పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అఘోరి తెలిపారు. అఘోరీ అంతకుముందు శ్రీకాళహస్తిలో మహాశివుడిని తనుదిగంబరంగా దర్శించుకునే ప్రయత్నం చేయగా, ఆలయ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె వారితో వాగ్వివాదానికి దిగడం, ఆత్మార్పణ యత్నం చేయడం వివాస్పదమైంది. చివరకు నాగశక్తి పీఠాధిపతి సూచనతో వస్త్రాన్ని కప్పుకుని దర్శన ప్రక్రియ పూర్తి చేసుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అఘోరీ
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని తెలంగాణ అఘోరి నాగ సింధు శుక్రవారం దర్శించుకున్నారు. వస్త్రాలు ధరించి స్వామి దర్శనానికికి వచ్చారు. ఎటువంటి అవాంఛననీయ ఘటనలు జరగకుండా ఆలయ సిబ్బంది పోలీస్ యంత్రాంగంతో అఘోరికి రక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వన్ టౌన్ సిఐ గోపి తిమ్మయ్య కానిస్టేబుల్ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com