కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

విజయవాడలో.. కారులో మంటలు వ్యాపించిన ఘటనలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఒంగోలుకు చెందిన మురళీధర్‌రెడ్డి అనే వ్యక్తి.. తన తండ్రి వెంకటరెడ్డి, కూతురు శ్రావ్యతో కలిసి విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. వారధి అటవీశాఖ చెక్‌పోస్ట్‌ వద్దకు రాగానే.. కారులో పొగలు వ్యాపించాయి. ప్రమాదం గమనించిన ముగ్గురూ కారు నుంచి కిందికి దిగారు. అనంతరం.. కారులో మంటలు వ్యాపించి.. పూర్తిగా తగలబడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పివేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే కారులో మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు.Tags

Next Story