ఏపీలో వింత : ఫిర్యాదు చేసిన దళిత రైతుపైనే పోలీస్ కేసు..

ఏపీలో దళితులపై దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నించినా.. అధికార పార్టీ నేతలను నిలదీసిన వారిపై వేధింపులు కొనసాగుతున్నాయి.. మొన్న దళిత డాక్టర్, నిన్న దళిత న్యాయమూర్తి, ఇప్పుడు దళిత రైతు.. ఇలా దళితులపై దాడులు పెరుగుతున్నాయి.. తాజాగా నెల్లూరులో ఏపీలో వింత : ఫిర్యాదు చేసిన దళిత రైతుపైనే పోలీసులు కేసు.. పెట్టడం కలకం రేపుతోంది..
తన పేరుతో జరిగిన ధాన్యం లావాదేవీలపై వెంటనే విచారణ చేపట్టాలని దళిత రైతు జయపాల్ జిల్లా కలెక్టర్‌ను కోరాడు.. రైతు విచారణ కోరిన 24 గంటలు గడవకముందే రైతును కటకటాల పాలు చేశారు స్థానిక అధికార పార్టీ నేతలు..
రైతుపై అక్రమ కేసుపై టీడీపీ నేతులు ఉద్యమం చేపట్టారు.. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌ను టీడీపీ నేతలు ముట్టడించారు. అకారణంగా రైతును నిర్బంధించిన స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com