AP: జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అనంతరం ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. అయితే జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన అనుచరులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ మాధవీ లత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. తనకు బెదిరింపు కాల్స్‌తో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని మాధవిలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో తెలిపారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు.
అసలు ఏం జరిగిదంటే.. ?
గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ ఈవెంట్‌ను మాధవిలత తప్పుపట్టారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగానే జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com