మాన్సాస్ ట్రస్టుఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు ..!

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవో వేంకటేశ్వర రావు తన వేతనాలను నిలిపివేశారంటూ మూడురోజులక్రితం ఉద్యోగులు ఛైర్మన్ అశోక్ గజపతిరాజును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్బంగా వారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈవోపై దాడికి ప్రేరేపించడంలో కారకులయ్యారంటూ కేసు నమోదుచేశారు వన్ టౌన్ పోలీసులు. ఛైర్మన్, కరస్పాండెంట్ తో సహా 10మంది ఉద్యోగులపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. కష్టం వచ్చిందని తమ గోడును చెప్పుకునేందుకు వెళితే ఛైర్మన్ తోపాటు తమపై కేసు పెట్టటంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ చేసే కార్యక్రమాలకు లేని కోవిడ్ నిబంధనలు ..ఆకలితో అలమటించే తమకు వర్తించడంపట్ల వారు అసహనం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com