ఆందోళన బాట పట్టిన జీడిమామిడి రైతులు

ఆందోళన బాట పట్టిన జీడిమామిడి రైతులు
జీడిమామిడి రైతులకు నష్టాల పరంపర కొనసాగుతోంది. ఏటా వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టడం.. పంట చేతికందే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు పిక్కలు నేల రాలుతుండడం, రంగు మారుతుండడం, కొన్నిచోట్ల చెట్లు కూకటి వేళ్లతో కూలిపోతుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి

జీడిమామిడి రైతులకు నష్టాల పరంపర కొనసాగుతోంది. ఏటా వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టడం.. పంట చేతికందే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు పిక్కలు నేల రాలుతుండడం, రంగు మారుతుండడం, కొన్నిచోట్ల చెట్లు కూకటి వేళ్లతో కూలిపోతుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంటోంది. దీంతో ఉద్దానం జీడి సాగు రైతులు ఆందోళన బాటపట్టారు. 80 కేజీల జీడి బస్తాకు 16వేల మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. RBKల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

మరోవైపు వరి,చెరకు పంటల తరువాత ఇక్కడి రైతులకు జీడిమామిడి పంటే జీవనాధారం. సిక్కోలు జిల్లాలో వేలాది హెక్టార్లలో జీడిమామిని రైతులు సాగు చేస్తున్నారు. గతేడాదిలో జీడిమామిడికి తేనే మంచు అధికం కావడంతో తెగుళ్ల పట్టిపీడించాయి. పిక్కలకు ధరలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూసారు.

RJ 80 కిలోల జీడిపిక్కల బస్తా 7వేల 200లకు మించి కొనలేదు. అదే గత ఏడాది 9వేల500 ధర పలికితే.. అయితే ఈ ఏడాది వర్షాల కారణంగా పిక్కల రంగుమారడం, కొనే వ్యాపారులు పలాస, జైపూర్‌, కేరళ తదితర ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి రాకపోవడంతో స్థానిక వ్యాపారులే వారికి నచ్చినంతకు కొంటున్నారని రైతులు వాపోతున్నారు. జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టు బాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు పలువురు కోరుతున్నారు.

మరోవైపు తొలి ధపా వచ్చిన కాపు పోయింది. అయినా రైతులు ఆశను వదులుకోలేక మలి విడత పురుగు మందులతో పాటు పూత నిలవడానికి మందులు పిచికారీ చేశారు. ఈసారి పూత నిలబడి కొంత మేర కాపు నిలిచింది. ఉన్న పంటైనా చేతి కందుతుందన్న తరుణంలో రైతుల ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లాయి. పిక్కలు ముదిరి చేతి కందే తరుణంలో వర్షాలు రోజూ పడడంతో పిక్క రంగు మారింది. అలాగే పంట దిగుబడి కూడా పడిపోయింది. వీటికితోడు కొన్నిచోట్ల టీదోమ, తామర పురుగుల బెడద దెబ్బతీశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story