CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
నేడు పులివెందులకు సీబీఐ బృందం

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా నేడు( మంగళవారం) పులివెందులకు సీబీఐ అధికారుల బృందం రానుంది. ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులు నేరుగా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిన్న సీబీఐ అధికారులకు భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మరోమారు ఇవాళ సీబీఐ బృందం భాస్కర్ రెడ్డి నివాసానికి వెల్లనుంది. కాసేపట్లోనే భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇక సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాశ్‌ రెడ్డి స్పందించారు. నిన్న మధ్యాహ్నం నోటీసులు అందుకున్నట్లు వెల్లడించారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణకు హాజరుకాలేకపోతున్నానన్నారు. నోటీసులు ఇచ్చిన తరువాత తనకు కావాల్సిన సమయం దొరకలేదన్నారు. సీబీఐ అధికారులు సమయం తక్కువ ఇవ్వడంతోనే వెళ్లలేకపోయినట్లు తెలిపారు. ఇక తదుపరి నోటీసులు అందిన వెంటనే సీబీఐ విచారణకు హాజరౌతానని ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. ఇక తనపై వచ్చిన అభియోగాలను జీర్జించుకోలేక పోతున్నానని అవినాష్ రెడ్డి అన్నారు. తానేంటో తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. న్యాయం గెలవాలి, నిజం వెల్లడి కావాలనేదే తన ధ్యేయమన్నారు. ఇక తనపై ఆరోపణలు చేసేవారు మరోసారి ఆలోచించుకోవాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story