CBI: కోర్టు దొంగతనం.. కాకాణి తప్పించుకోలేడు

CBI: కోర్టు దొంగతనం.. కాకాణి తప్పించుకోలేడు
X
సోమిరెడ్డిని విచారించిన సీబీఐ

టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని సీబీఐ విచారించింది. నెల్లూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో రెండు గంటలపాటు సీబీఐ అధికారులు ఆయనను విచారించారు. దీనిపై స్పందించిన ఆయన కోర్టు దొంగతనం కేసులో మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తప్పించుకోలేడని అన్నారు. నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు, ఫొటో మార్ఫింగ్, కోర్టులో దొంగతనం కేసుల్లో కాకాణి నిండా మునిగిపోయారని ఆయనకు శిక్ష తప్పకుండా పడుతుందని సోమిరెడ్డి వెల్లడించారు. నెల్లూరు చరిత్రలో రాజకీయ నాయకుల కోసం సీబీఐ వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Tags

Next Story