Vivek Murder: ఉదయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

Vivek Murder:  ఉదయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ
ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. యురేనియం ఉద్యోగి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఇవాళ అదుపులోకి తీసుకుంది. ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వివేక హత్య జరిగిన రోజున ఘటనా స్థలానికి అవినాశ్‌, శివశంకర్‌ రెడ్డితో కూడా ఉదయ్‌ కుమార్‌ కూడా వెళ్ళాడు. గతంలో సీబీఐ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన రాంసింగ్ పై ఉదయ్ కుమార్ రెడ్డి కేసు పెట్టారు. సీబీఐ అధికారులు ఆయనను కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story