విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌..కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌..కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
X
CBI Court: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

CBI Court: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కౌంటరు దాఖలు చేయాలని విజయసాయిరెడ్డిని, సీబీఐని ఆదేశించిన కోర్టు వాదనల్ని ఈ నెల 13కు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో దాన్ని సమర్పించాలంది. ఇవాళ వాదనల సందర్భంగా విజయసాయిరెడ్డిపై కోర్టుకు ఫిర్యాదు చేశారు పిటిషనర్‌. తాము ఇచ్చిన నోటీసుకు విజయసాయిరెడ్డి స్పందించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు ఆర్డర్ చేస్తేనే నోటీసు తీసుకుంటామన్నారని వివరించారు. దీంతో.. విజయసాయిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు..సీబీఐ స్పందించినప్పుడు మీకేంటి అభ్యంతరం అంటూ ప్రశ్నించింది. 13న సీబీఐ, విజయసాయిరెడ్డి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది.

Tags

Next Story