Illegal Mining Case: ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ దూకుడు

Illegal Mining Case: ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ దూకుడు
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సుప్రీంకు సీబీఐ, సీబీఐ పిటిషన్‌తో వైసీపీ వర్గాల్లో ఆందోళన

ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. జగన్ సన్నిహిత ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సుప్రీంకు వెళ్లింది సీబీఐ. దీంతో ఓబుళాపురం కేసులో జగన్‌కు మళ్లీ ఇబ్బందులు ఎదురు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ పిటిషన్‌తో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైయ్యింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో పాటు మరికొందరికి ఉచ్చు బిగుసుకోనున్నట్లు తెలుస్తుంది.

గతంలోనే మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా సుప్రీం తలుపు తట్టింది. గనుల కేటాయింపుల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లబ్ధి చేకూర్చారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి.. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్నా సిమెంట్స్‌కు అక్రమంగా లబ్ది చేకూర్చిన కేసులో జగన్‌తో పాటు నిందితురాలిగా ఉన్నారు శ్రీలక్ష్మి. పెన్నా సిమెంట్స్ కేసులో జగన్, ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు శ్రీలక్ష్మి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

అనంతపురంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో బుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన సీబీఐ.. ఈ మేరకు చర్యలకు సిద్ధం అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేసిన శ్రీలక్ష్మి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ కాలం పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు నిర్వహించిన శ్రీలక్ష్మి.. కుట్రకు పాల్పడ్డారని, అక్రమంగా మైనింగ్ లైసెన్సులు మంజూరు చేశారని శ్రీలక్ష్మిపై సీబీఐ అభియోగాలు మోపింది. గాలి జనార్ధన్ రెడ్డికి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక అక్రమ మైనింగ్‌ కేసులో 2011లో శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్టు కూడా చేసింది.

Tags

Read MoreRead Less
Next Story