ఎంపీ అవినాష్‌ను అరెస్ట్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌

ఎంపీ అవినాష్‌ను అరెస్ట్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌
వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి హాజరు కావాల్సి ఉంది

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరు కానీ ఎంపీ అవినాష్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి కడపకు వెళుతున్నాడు. దీంతో అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ అధికారులకు హెడ్ క్యార్ట‌ర్స్ నుంచి ఆదేశాలు అందాయి. విచార‌ణ కు అవినాష్‌ డుమ్మా కొట్టిన విష‌యాన్ని హెడ్ క్వార్ట‌ర్స్‌కు HYD CBI అధికారులు తెలిపారు. దీంతో అరెస్ట్ కు హెడ్ క్వార్ట‌ర్స్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందిన‌ట్లు స‌మాచారం.

అతడిని అరెస్ట్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో పారిపోతున్న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారుల బృందాలు వెంబ‌డిస్తున్నాయి. ఈ క్రమంలో సీబీఐ అధికారులు ఫోన్‌చేసినా కారు ఆప‌కుండా వెళ్తున్నాడు. త‌ను ఆగే ప్ర‌స‌క్తే లేద‌ని, త‌న త‌ల్లిని చూడాల‌ని CBI అధికారుల‌కు అవినాష్‌ రెడ్డి చెబుతున్నారు. పులివెందుల‌కు వెళ్లైనా అవినాష్‌ రెడ్డి ని అరెస్ట్ చేయాల‌ని సిబిఐ అధికారులు నిశ్చ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

Tags

Read MoreRead Less
Next Story