YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో త్వరలోనే మరికొన్ని అరెస్ట్‌లు..?

YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో త్వరలోనే మరికొన్ని అరెస్ట్‌లు..?
X
YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

YS Vivekananda Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో రెండు ఛార్జిషీట్లు వేసి ఐదుగురిని నిందితులుగా చేర్చిన సీబీఐ.. మరింత దూకుడుగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన వారం రోజుల పాటు జిల్లాలోనే ఉండి దర్యాప్తును పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కడపకు చేరుకున్న వెంటనే సీబీఐ అధికారులతో సమావేశమైన డీఐజీ చౌరాసియా.. దర్యాప్తు పురోగతిపై ఆరా తీసిశారు.

దర్యాప్తు సమయంలో.. ఇప్పటికే ఛార్జిషీట్‌లో చేర్చిన ఐదుగురు నిందితులతో పాటు.. మరికొందరి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివేక హత్యలో వీరి పాత్ర ఏంటన్నదానిపై సీబీఐ లోతుగా దర్యాప్తు జరుపుతోంది. వీరి పాత్రపై ఇప్పటికే ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన సీబీఐ అధికారులు.. త్వరలో మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకావం ఉందని అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు వచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కీలక దశకు రావడంతో.. పూర్తిస్థాయి ఆధారాలతో అరెస్ట్‌లకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story