ఇవాళ కూడా రాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్‌ లేఖ

ఇవాళ కూడా రాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్‌ లేఖ
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఉత్కంఠ రేపుతుంది. ఇవాళ్టి విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాయడంతో సీబీఐ అధికారులు

అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఉత్కంఠ రేపుతుంది. ఇవాళ్టి విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాయడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. నేరుగా కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఇక ఆస్పత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తున్నారు.

గత 4 రోజులుగా విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్‌ రెడ్డి ఉన్నారు. తల్లి ఆరోగ్యం బాగాలేదని సీబీఐ విచారణకు హాజరు కాకుండా అక్కడే ఉన్నారు. సీబీఐ అధికారులు ఆస్పత్రికి చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ నెల 16వ తేదీనే అవినాష్ రెడ్డి విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ముందుస్తు కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు రాలేనని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ 19వ తేదీన విచారణకు రావాలని మరోమారు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ రోజు కూడా విచారణకు డుమ్మా కొట్టారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి విచారణకు దూరంగా ఉన్నారు. అయితే సీబీఐ నుంచి రిప్లే రాకముందే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయారు. ఇక అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ అధికారులు సీరియస్‌ అయ్యారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయబోతుందంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌కు సైతం చేరవేశారు అధికారులు.

తాజాగా ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ చెప్పినప్పటికీ.. విచారణకు రావడం కుదరదని తన తల్లి డిశ్చార్జ్‌ అయ్యాకే విచారణకు వస్తానని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా నాలుగు రోజులుగా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story