CBN: తెలుగు వైభవం చాటేలా అమరావతి అభివృద్ధి

CBN: తెలుగు వైభవం చాటేలా అమరావతి అభివృద్ధి
X
అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం...సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి..సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి­ని వే­గ­వం­తం చే­యా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం మరింత దృ­ష్టి సా­రి­స్తోం­ది. రా­జ­ధా­ని ని­ర్మా­ణం కే­వ­లం పరి­పా­ల­నా కేం­ద్రం­గా మా­త్ర­మే కా­కుం­డా తె­లు­గు సం­స్కృ­తి, సం­ప్ర­దా­యాల వై­భ­వా­న్ని ప్ర­తి­బిం­బిం­చే­లా ఉం­డా­ల­ని రా­ష్ట్ర ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి పను­ల్లో స్వ­యం సమృ­ద్ధి సా­ధిం­చే వి­ధం­గా సె­ల్ఫ్ ఫై­నా­న్స్ ప్రా­జె­క్టు­ల­కు ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని ఆయన అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చే­లా మౌ­లిక వస­తు­లు ఏర్పా­టు చే­య­డం, క్రీ­డ­లు మరి­యు పర్యా­టక రం­గా­ల­ను అభి­వృ­ద్ధి చేసే వి­ధం­గా ప్ర­త్యేక ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­యా­ల­ని కూడా ఆయన ఆదే­శిం­చా­రు. మం­గ­ళ­వా­రం సచి­వా­ల­యం­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన సీ­ఆ­ర్‌­డీఏ అథా­రి­టీ 59వ సమా­వే­శం­లో రా­జ­ధా­ని అభి­వృ­ద్ధి­కి సం­బం­ధిం­చిన పలు కీలక అం­శా­ల­పై వి­స్తృ­తం­గా చర్చిం­చా­రు. భూ కే­టా­యిం­పు­లు, మౌ­లిక సదు­పా­యాల అభి­వృ­ద్ధి, వి­ద్యా మరి­యు సాం­స్కృ­తిక ప్రా­జె­క్టుల అమలు వంటి పలు ప్ర­తి­పా­ద­న­ల­కు ఈ సమా­వే­శం­లో సీ­ఆ­ర్‌­డీఏ ఆమో­దం తె­లి­పిం­ది. అమ­రా­వ­తి­ని అం­త­ర్జా­తీయ స్థా­యి­లో అభి­వృ­ద్ధి చే­యా­ల­నే లక్ష్యం­తో పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చేం­దు­కు ప్ర­భు­త్వ శా­ఖ­లు సమ­న్వ­యం­తో పని­చే­యా­ల­ని ము­ఖ్య­మం­త్రి సూ­చిం­చా­రు.

రాజధాని ప్రాంతంలో...

సమావేశంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో విద్యా, సాంస్కృతిక మరియు పరిపాలనా నిర్మాణాలకు భూముల కేటాయింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర విద్యా బోర్డు అయిన సీబీఎస్‌ఈ కార్యాలయం నిర్మాణం కోసం అమరావతిలో 80 సెంట్ల భూమి కేటాయించేందుకు సీఆర్‌డీఏ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా అమరావతిని విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి మూడు ఎకరాల భూమి కేటాయించేందుకు కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. గ్రామీణాభివృద్ధి మరియు స్థానిక పరిపాలనకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సంస్థ అయినఏపీఎస్‌ఐఆర్‌డీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ఈ సంస్థ ద్వారా గ్రామీణ పాలనలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న సచివాలయం మరియు హెచ్‌వోడీ టవర్ల పనులకు మొత్తం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఈ నిర్మాణాల ద్వారా ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట పనిచేసే విధంగా ఆధునిక కార్యాలయ సముదాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో తెలుగు సంస్కృతి, కళల ప్రోత్సాహానికి ప్రత్యేకంగా ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.119 కోట్ల వ్యయంతో అమరావతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి సీఆర్‌డీఏ అంగీకారం తెలిపింది. ఈ కేంద్రం ద్వారా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళలను ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో అమలు చేసే అంశంపై సమావేశంలో సమీక్షించారు.

సచి­వా­ల­యం­లో జరి­గిన ఈ సమా­వే­శా­ని­కి రా­ష్ట్ర పు­ర­పా­లక శాఖ మం­త్రి పి నా­రా­యణ, ఆర్థిక మం­త్రి పయ్యా­వుల కే­శ­వ్ , రా­ష్ట్ర ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి సా­యి­ప్ర­సా­ద్ సహా పట్ట­ణా­భి­వృ­ద్ధి శాఖ, సీ­ఆ­ర్‌­డీఏ, ఏడీ­సీ­ఎ­ల్‌­కు చెం­దిన ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు. అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి­కి సం­బం­ధిం­చిన పలు ప్రా­జె­క్టుల అమలు స్థి­తి­పై అధి­కా­రు­లు వి­వ­రా­లు అం­దిం­చా­రు. భూ కే­టా­యిం­పు­ల­కు సం­బం­ధిం­చిన జీ­ఓ­లు జారీ చేసే అంశం, ప్ర­భు­త్వ సం­స్థ­ల­కు అవ­స­ర­మైన మౌ­లిక సదు­పా­యాల ఏర్పా­టు వంటి వి­ష­యా­ల­పై కూడా చర్చిం­చా­రు. అమ­రా­వ­తి­ని అం­త­ర్జా­తీయ ప్ర­మా­ణా­ల­తో అభి­వృ­ద్ధి చే­యా­లం­టే పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం అత్యంత కీ­ల­క­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. రా­ష్ట్రా­ని­కి రా­వా­ల­ను­కు­నే సం­స్థ­ల­తో అధి­కా­రు­లు ని­రం­త­రం సం­ప్ర­దిం­పు­లు కొ­న­సా­గిం­చా­ల­ని ఆయన సూ­చిం­చా­రు. పె­ట్టు­బ­డి­దా­రు­ల­కు అను­కూల వా­తా­వ­ర­ణం కల్పిం­చేం­దు­కు ప్ర­భు­త్వ యం­త్రాం­గం చు­రు­కు­గా పని­చే­యా­ల­ని తె­లి­పా­రు. ప్ర­త్యే­కం­గా క్రీ­డా మౌ­లిక వస­తు­లు, పర్యా­టక ఆక­ర్ష­ణ­లు ఏర్పా­టు చే­స్తే అమ­రా­వ­తి­కి అం­త­ర్జా­తీయ గు­ర్తిం­పు వచ్చే అవ­కా­శం ఉం­ద­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. రా­జ­ధా­ని పరి­ధి­లో పె­ద్ద స్థా­యి సమా­వే­శా­లు, అం­త­ర్జా­తీయ సద­స్సు­లు ని­ర్వ­హిం­చు­కు­నే­లా కన్వె­న్ష­న్ సెం­ట­ర్ ని­ర్మా­ణం ప్ర­తి­పా­ద­న­పై కూడా ఈ సమా­వే­శం­లో చర్చిం­చా­రు. ఇప్ప­టి­కే ప్ర­భు­త్వం ఈ ప్రా­జె­క్టు­ను ప్ర­తి­పా­దిం­చ­గా, దాని అమలు వి­ధా­నం­పై అధి­కా­రు­ల­తో ము­ఖ్య­మం­త్రి చంద్రబాబు నాయుడు సమీ­క్షిం­చా­రు.

Tags

Next Story