CBN: అమరావతిని సింగపూర్ చేస్తా

CBN: అమరావతిని సింగపూర్ చేస్తా
X
సింగపూర్ చంద్రబాబు పర్యటన.. తెలుగు డయాస్పోరాతో సమావేశం.. భారీగా తరలివచ్చిన ప్రవాసాంధ్రులు.. ముఖ్యమంత్రి కీలక ప్రసంగం

సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్ర మంలో సీఎం ప్రసంగించారు. "టీడీపీపా హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాట- య్యాయి. పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారు.." అని తెలిపారు. భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులతో సమావేశం అయ్యారు. 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పటికి నేను చాలా బాధప- డుతున్నాను. రాష్ట్రాన్ని పున నిర్మాణం చేపట్టాను.. ఏపీని హెల్త్, వెల్తీ, హ్యాపి సొసైటిగా మారుస్తామని హామీ ఇచ్చా- రు. కాగా, సింగపూర్లా అమరావతిని చేస్తానని 2014లో హామీ ఇచ్చాన్నారు. 2047 నాటికి యువత ఎక్కువగా ఉండే దేశం భారత్.. 2047 నాటికి భారతీయులు ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంటారని చంద్రబాబు వెల్లడించారు.

అనూహ్య స్పందన


సింగపూర్ సహా సమీపంలోని 5 దేశాల నుంచి పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు రాకకు ముందే తెలుగువారి- తో ఆడిటోరియం నిండిపోయింది. ప్రధాన ఆడిటోరియం నిండి పోవడంతో అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలోకి సభికులను తరలించారు. ఐదు గంటల పాటు అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం సాగింది. భార్యాపిల్లలు, స్నేహితులతో కలిసి వచ్చిన ఎన్ఆర్ఐలు తరలివ- చ్చారు. కార్యక్రమం అనంతరం దాదాపు 2,500 మందితో సీబీఎన్ ఫోటో సెష న్ నిర్వహించారు. రెండున్నర గంటలపాటు ఓపిగ్గా నిలబడి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన సీఎం.. వేదికపైనే ఉండి ప్రతి కుటుం బం ఫోటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ సహకరించారు. "భవిష్యత్తు అంతా. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మా. నాలెడ్జ్ ఎకానమీలో తెలగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించా. సింగపూ- ర్ లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణం." అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు క్రెడిట్ వల్లే: లోకేశ్


ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారున్నారంటే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుం దన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు ఆయన విజనరీ కారణమని పే- ర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని లో- కేశ్ తెలిపారు. "రాష్ట్రంలో రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి మీకే బాగా తెలు- సు. ఐదేళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారు." అని లోకేశ్ వెల్లడించారు.

Tags

Next Story