CBN: ఎరువుల సరఫరాపై సీఎం కీలక ఆదేశాలు

CBN: ఎరువుల సరఫరాపై సీఎం కీలక ఆదేశాలు
X
క్షేత్రస్థాయికి వెళ్లాలని కలెక్టర్లకు ఆదేశం

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఎరు­వుల సర­ఫ­రా తీ­రు­తె­న్ను­ల­ను క్షే­త్ర­స్థా­యి­కి వె­ళ్లి స్వ­యం­గా పర్య­వే­క్షిం­చా­ల­ని కలె­క్ట­ర్ల­ను సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. ఎరు­వుల సర­ఫ­రా­పై రై­తు­ల్లో ఉన్న అను­మా­నా­లు, ఆం­దో­ళన తొ­ల­గిం­చా­ల­ని ని­ర్దే­శిం­చా­రు. వచ్చే రబీ­లో వె­బ్‌ ల్యాం­డ్‌ - ఈ పంట అను­సం­ధా­నం­తో రై­తుల ఆధా­ర్‌ ఆధా­రం­గా ఎరు­వుల సర­ఫ­రా చే­ప­ట్టా­ల­ని సూ­చిం­చా­రు. ఎరు­వుల లభ్యత, సర­ఫ­రా­పై కలె­క్ట­ర్లు, ఎస్పీ­లు, వ్య­వ­సాయ శాఖ అధి­కా­రు­ల­తో సీఎం చం­ద్ర­బా­బు టె­లీ­కా­న్ఫ­రె­న్స్‌ ని­ర్వ­హిం­చా­రు. ఎరు­వుల సర­ఫ­రా­పై రై­తుల నుం­చి నే­రు­గా తాను తె­ప్పిం­చు­కు­న్న ఫీ­డ్‌ బ్యా­క్‌ ఆధా­రం­గా సమీ­క్ష జరి­పా­రు. జి­ల్లాల నుం­చి తె­ప్పిం­చు­కు­న్న సమా­చా­రా­న్ని అధి­కా­రు­లు ఇచ్చిన సమా­చా­చం­తో పో­ల్చి చూసి సం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. జి­ల్లా­ల్లో ఎం­తెంత ఎరు­వు­లు అం­దు­బా­టు­లో ఉన్నా­యి, డి­మాం­డ్‌ ఎలా ఉంది అనే వి­ష­యా­ల­ను కలె­క్ట­ర్లు సీ­ఎం­కు వి­వ­రిం­చా­రు. ఎరు­వుల సర­ఫ­రా సక్ర­మం­గా జరు­గు­తోం­ద­ని రై­తు­ల­కు డి­మాం­డ్‌ మే­ర­కు అం­దు­తు­న్నా­య­ని అధి­కా­రు­లు చె­ప్పా­రు. జి­ల్లా­ల్లో 77,396 మె­ట్రి­క్‌ టన్నుల ఎరు­వు­లు అం­దు­బా­టు­లో ఉన్నా­య­ని తె­లి­పా­రు.

అదనంగా 41 వేల టన్నుల ఎరువులు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు త్వ­ర­గా 41 వేల టన్ను­లు ఎరు­వు­లు రా­ను­న్నా­యి. కా­కి­నాడ పో­ర్టు­కు రేపు ఒక వె­జ­ల్‌ వస్తుం­ద­ని దాని నుం­చి 15000 మె­ట్రి­క్‌ టన్నుల ఎరు­వు­లు అం­దు­బా­టు­లో­కి వస్తా­య­ని సీఎం చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. మరో 10 రో­జు­ల్లో 41 వేల టన్నుల ఎరు­వు­లు రా­ష్ట్రా­ని­కి అద­నం­గా రా­ను­న్నా­య­ని అధి­కా­రు­లు సీఎం దృ­ష్టి­కి తీ­సు­కె­ళ్లా­రు. బా­ప­ట్ల, కృ­ష్ణా, కడప జి­ల్లా­లో­ని కొ­న్ని ప్రాం­తా­ల్లో ఎరు­వుల కొరత ఉం­ద­ని ఈ సమ­స్య పరి­ష్క­రిం­చేం­దు­కు ఇతర ప్రాం­తాల నుం­చి తె­ప్పి­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. ఆ సమ­స్య­ని కూడా సత్వ­ర­మే పరి­ష్క­రిం­చా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు.

ముమ్మరంగా సాగుతున్న అమరావతి పనులు

ఏపీ రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో ప్ర­భు­త్వ భవ­నాల ని­ర్మాణ పను­లు వే­గం­గా జరు­గు­తు­న్న­ట్లు పు­ర­పా­ల­క­శాఖ మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. నే­ల­పా­డు­లో గె­జి­టె­డ్ అధి­కా­రుల ఇళ్ల­ను పరి­శీ­లిం­చా­రు. అనం­త­రం భవన ని­ర్మా­ణాల పనుల పు­రో­గ­తి­పై సీ­ఆ­ర్డీఏ ఇం­జి­నీ­ర్లు, గు­త్తే­దా­రు సం­స్థ ప్ర­తి­ని­ధు­ల­తో భేటీ అయ్యా­రు. అమ­రా­వ­తి­లో ఇళ్ల ని­ర్మా­ణం, మౌ­లిక వస­తుల కల్ప­న­ను వే­గ­వం­తం చే­యా­ల­ని మం­త్రి సూ­చిం­చా­రు. ప్ర­స్తు­తం అమ­రా­వ­తి­లో గె­జి­టె­డ్ అధి­కా­రు­ల­కు 14 టవ­ర్స్ లో 1440 ఇళ్ల­ను ని­ర్మి­స్తు­న్నా­రు. డి­సెం­బ­ర్ 31 లోగా అన్ని టవ­ర్ల ని­ర్మా­ణా­ల­ను పూ­ర్తి చే­స్తా­మ­ని, అమ­రా­వ­తి­లో రో­డ్లు, డ్రె­యి­న్ల పను­లు వే­గం­గా జరు­గు­తు­న్నా­య­ని మం­త్రి పే­ర్కొ­న్నా­రు. ఐఏ­ఎ­స్ అధి­కా­రుల టవ­ర్ల ని­ర్మా­ణం కూడా దా­దా­పు­గా పూ­ర్తైం­ద­న్నా­రు. ఇటీ­వల కు­రి­సిన వర్షా­ల­కు అమ­రా­వ­తి ము­ని­గి­పో­యిం­ద­ని, అక్కడ ఇళ్ల ని­ర్మాణ పను­లు జర­గ­డం లే­ద­ని కొం­ద­రు అస­త్య ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. ఏసీ రూ­ము­ల్లో కూ­ర్చు­ని చూసే వా­రి­కి ని­ర్మా­ణాల గు­రిం­చి తె­లి­య­ని, బయ­ట­కు వచ్చి చూ­స్తే ని­జ­ని­జా­లేం­టో తె­లు­స్తా­య­న్నా­రు.

Tags

Next Story