CBN: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదు:సీఎం

అమరావతి, పోలవరం, హైవేలు వంటి కీలక ప్రాజెక్టులకు మోడీ, కేంద్రం సహకరిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం మొన్నటి వరకు వెంటిలేటర్‌పై ఉందని, ఇప్పుడు నిలదొక్కుకుని ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైసీపీ వ్యతిరేకించడంపై చంద్రబాబు మండిపడ్డారు. టెండర్లో పాల్గొనే వారికి వార్నింగ్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం గురించి తెలియని వారు ప్రైవేట్ పరం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం కూడా పీపీపీ విధానంపై స్పష్టంగా ఉందని, మెరుగైన సేవలు, ఉద్యోగాలు కల్పించాలంటే ఆ విధానం బెస్ట్ అని చెప్తోందని చంద్రబాబు తెలిపారు. ‘‘పీపీపీ పద్ధతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీ మంత్రి సత్యకుమార్‌కు జేపీ నడ్డా లేఖ
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు లేఖ ద్వారా సూచించారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల విస్తరణ, సేవల నాణ్యత పెంపు కోసం పీపీపీ మోడల్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. PPP ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Viability Gap Funding (VGF) కింద ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. పీపీపీ విధానం ద్వారా ఆరోగ్య రంగంలో 7 ప్రధాన లాభాలు ఉన్నాయని మంత్రి నడ్డా లేఖలో పేర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనవి.. ప్రభుత్వ లక్ష్యాల సాధన వేగవంతం అవుతుంది.. మౌలిక వసతుల విస్తరణకు ప్రైవేట్ పెట్టుబడులు లభిస్తాయి.. సేవల నాణ్యత, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది.. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది.. వైద్య విద్య, పరిశోధన రంగాలకు కొత్త ఊపు వస్తుంది.. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగి, దీర్ఘకాలిక భాగస్వామ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

