CBN: రైతులను ఇబ్బంది పెట్టొద్దు

CBN: రైతులను ఇబ్బంది పెట్టొద్దు
X
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

రా­జ­ధా­ని ప్రాంత అభి­వృ­ద్ధి అథా­రి­టీ (సీ­ఆ­ర్డీఏ) సమీ­క్ష సమా­వే­శం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ సీఎం చం­ద్ర­బా­బు కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ప్ర­తి 15 రో­జు­ల­కు రా­జ­ధా­ని పై సమీ­క్ష ని­ర్వ­హి­స్తా­న­ని తె­లి­పా­రు. కొ­న్ని సం­స్థ­లు.. వర్క్ ఫో­ర్స్.. మె­షి­న­రీ.. పూ­ర్తి స్థా­యి­లో కే­టా­యిం­చ­లే­ద­న్నా­రు. ఇలా ఉన్న సం­స్థ­లు తమ పని­తీ­రు మె­రు­గు పరు­చు­కో­వ­ల­ని సూ­చిం­చా­రు.. ఇక, రి­ట­ర్న­బు­ల్ ప్లా­ట్ల వి­ష­యం­లో రై­తు­ల­ను ఇబ్బం­ది పె­ట్ట­వ­ద్ద­ని సీఎం చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు. త్వ­ర­లో రా­జ­ధా­ని రై­తు­ల­తో సమా­వే­శం అవ్వ­ను­న్న­ట్టు వె­ల్ల­డిం­చా­రు.. రా­జ­ధా­ని రై­తు­ల­తో త్వ­ర­లో సమా­వే­శం అవు­తా.. రై­తు­ల­ను ఇబ్బం­ది పె­ట్ట­వ­ద్ద­ని స్ప­ష్టం చే­శా­రు. కాగా, గతం­లో అమ­రా­వ­తి­లో­ని సీ­ఆ­ర్డీ­యే కా­ర్యా­ల­యా­న్ని ప్రా­రం­భిం­చిన సమ­యం­లో రై­తు­ల­తో సమా­వే­శ­మైన ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు… రై­తు­లు భూ­ము­లి­చ్చి రా­జ­ధా­ని ని­ర్మా­ణా­ని­కి సహ­క­రిం­చా­ర­ని గు­ర్తు చే­సిన వి­ష­యం వి­ది­త­మే.. ఇక, రా­జ­ధా­ని రై­తు­ల­కు రి­ట­ర్న­బు­ల్‌ ప్లా­ట్ల కే­టా­యిం­పు.. వాటి రి­జి­స్ట్రే­ష­న్‌ వి­ష­యం­లో.. కొం­ద­రు పని­గ­ట్టు­కు­ని తప్పు­డు ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని.. సో­ష­ల్‌ మీ­డి­యా­లో ప్ర­భు­త్వం­పై ఇష్ట­మైన రీ­తి­లో పో­స్టు­లు పె­డు­తు­న్నా­ర­ని.. ఈ మధ్యే మం­త్రి నా­రా­యణ మం­డి­ప­డ్డా­రు.. రై­తు­ల­కు న్యా­యం చే­స్తా­మ­ని.. వీ­లై­నంత త్వ­ర­లో వా­రి­కి రి­ట­ర్న­బు­ల్‌ ప్లా­ట్లు ఇస్తాం మని మం­త్రి నా­రా­యణ స్ప­ష్టం చేశారు..

రా­జ­ధా­ని ని­ర్మా­ణా­ని­కి భూ­ము­లి­చ్చిన రై­తు­ల­కు రి­ట­ర్న­బు­ల్ ప్లా­ట్ల రి­జి­స్ట్రే­ష­న్ ప్ర­క్రియ ఎం­త­వ­ర­కు పూ­ర్తైం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు ఆరా తీ­శా­రు. ఈ సం­ద­ర్భం­గా రి­ట­ర్న­బు­ల్ ప్లా­ట్ల రి­జి­స్ట్రే­ష­న్ల­కు సం­బం­ధిం­చిన వి­వ­రా­లు అధి­కా­రు­లు అం­దిం­చా­రు. ఇంకా 2,471 మంది రై­తు­ల­కు రి­ట­ర్న­బు­ల్ ప్లా­ట్ల­ను రి­జి­స్ట్రే­ష­న్లు చే­యా­ల్సి ఉం­ద­ని, ఇవి కూడా చి­న్న­పా­టి సాం­కే­తిక, రై­తుల వ్య­క్తి­గత అం­శాల కా­ర­ణం­గా పెం­డిం­గు­లో ఉన్నా­య­ని అధి­కా­రు­లు ము­ఖ్య­మం­త్రి­కి తె­లి­పా­రు. తాను కూడా త్వ­ర­లో­నే రా­జ­ధా­ని రై­తు­ల­తో సమా­వే­శ­మ­వు­తా­న­ని వె­ల్ల­డిం­చా­రు. రా­జ­ధా­నుల గా­ర్డె­నిం­గ్, బ్యూ­టి­ఫి­కే­ష­న్ వంటి వా­టి­ల్లో ఎలాం­టి రా­జీ­ప­డొ­ద్ద­ని సూ­చిం­చా­రు.

Tags

Next Story