CBN: ఉద్యోగులకు ఇబ్బంది రాదు.. నేను రానివ్వను

CBN: ఉద్యోగులకు ఇబ్బంది రాదు.. నేను రానివ్వను
X
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... గురుపూజోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.... టీచర్లను మర్పిపోలేమన్న సీఎం చంద్రబాబు

పి­ల్ల­ల్లో వి­జ్ఞాన జ్యో­తు­లు వె­లి­గి­స్తు­న్న వా­రం­ద­రి­కీ సీఎం చం­ద్ర­బా­బు అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. వి­జ­య­వా­డ­లో ని­ర్వ­హిం­చిన గు­రు­పూ­జో­త్సవ కా­ర్య­క్ర­మం­లో సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రు­లు నారా లో­కే­శ్‌, సత్య­కు­మా­ర్ యా­ద­వ్​­ల­తో­పా­టు ఇతర నే­త­లు పా­ల్గొ­న్నా­రు. ఉత్తమ ఉపా­ధ్యా­యు­ల­కు అవా­ర్డు­లు ప్ర­దా­నం చే­శా­రు. వి­ద్యా­శాఖ ఏర్పా­టు చే­సిన ఎగ్జి­బి­ట్ బె­స్ట్ ప్రా­క్టీ­సె­స్ వి­ధా­నా­ల­ను సీఎం పరి­శీ­లిం­చా­రు. టీ­చ­ర్ల­ను జీ­వి­తం­లో ఎప్పు­డూ మరి­చి­పో­లే­మ­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. పి­ల్ల­ల్లో స్ఫూ­ర్తి­ని కలి­గిం­చే­ది, మనలో ఉన్న నై­పు­ణ్యా­న్ని గు­ర్తిం­చి బయ­ట­కు తీ­సే­ది గు­రు­వు­లే అన్న చం­ద్ర­బా­బు.. భక్త­వ­త్స­లం అనే ఉపా­ధ్యా­యు­డు తన జీ­వి­తం­లో స్ఫూ­ర్తి నిం­పా­ర­ని వె­ల్ల­డిం­చా­రు.

నేను నిత్య విద్యార్థిని

తాను ని­త్య వి­ద్యా­ర్థి­ని.. ప్ర­తి రోజు ఏదో ఒకటి నే­ర్చు­కుం­టూ­నే ఉం­టా­న­ని అన్నా­రు. వి­ద్యా­ర్థు­లు జా­తీయ వి­ద్యా­సం­స్థ­ల్లో అడ్మి­ష­న్లు సా­ధిం­చే­లా తీ­ర్చి­ది­ద్దా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. ఎన్​ఐ­ఆ­ర్​ఎ­ఫ్​ ర్యాం­కిం­గ్‌­లో ఆం­ధ్ర వర్శి­టీ­కి 4వ ర్యాం­కు రా­వ­డం శు­భ­ప­రి­ణా­మ­మ­ని, ఇలాం­టి ర్యాం­కు­లు మరి­న్ని రా­వా­ల­ని ఆకాం­క్షిం­చా­రు. అలా­నే మెగా పే­రెం­ట్స్ టీ­చ­ర్స్ మీ­టిం­గ్ సం­ద­ర్భం­గా నె­ల­కొ­ల్పిన గి­న్ని­స్ రి­కా­ర్డు సర్టి­ఫి­కె­ట్​­ను ని­ర్వా­హ­కు­లు ము­ఖ్య­మం­త్రి­కి అం­దిం­చా­రు. గు­రు­పూ­జో­త్స­వం చాలా పవి­త్ర­మైన కా­ర్య­క్ర­మ­మ­ని సీఎం చం­ద్ర­బా­బు వ్యా­ఖ్యా­నిం­చా­రు. తల్లి­దం­డ్రుల తర్వాత మనం గు­ర్తు పె­ట్టు­కు­నే­ది ఉపా­ధ్యా­యు­ల­నే అని, అలాం­టి వా­రి­ని జీ­వి­తం­లో ఎప్పు­డూ మరి­చి­పో­లే­మ­ని అన్నా­రు. వి­ద్యా­ర్థి దశలో పి­ల్ల­ల్లో స్ఫూ­ర్తి­ని కలి­గిం­చా­ల­న్నా­రు.

క్రెడిట్ అంతా భువనేశ్వరిదే

"సా­ధా­ర­ణం­గా రా­జ­కీయ నా­య­కుల పి­ల్ల­లు చదు­వు­కో­రు. లో­కే­శ్‌ చదు­వు గు­రిం­చి నా భా­ర్యే చూ­సే­ది.. ఆ క్రె­డి­ట్‌ ఆమె­దే. డీ­ఎ­స్సీ అంటే ఎప్పు­డూ జా­ప్యం చే­య­ను.. సమ­యా­ని­కి భర్తీ చే­స్తా. ఒక­ప్పు­డు టీ­చ­ర్ల బది­లీ­లు జడ్పీ ఛై­ర్మ­న్‌ చే­తి­లో ఉం­డే­వి. టీ­చ­ర్ల బది­లీ­ల్లో కౌ­న్సి­లిం­గ్‌ ప్ర­క్రియ తె­చ్చిం­ది నేనే. కొ­న్ని ఉద్యో­గా­ల్లో పు­రు­షుల కంటే మహి­ళ­లే ఎక్కువ సం­పా­ది­స్తు­న్నా­రు. తల్లి­కి వం­ద­నం పే­రు­తో పి­ల్ల­లు చదు­వు­కు­నేం­దు­కు అం­డ­గా ఉన్నాం. ఇం­ట­ర్‌ వి­ద్యా­ర్థు­ల­కు కూడా మధ్యా­హ్న భో­జ­నం ఇస్తు­న్నాం’" అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

విద్యను రాజకీయాలకు దూరంగా ఉంచాం:లోకేశ్

గు­రు­వు­లు చూ­పిం­చిన దా­రి­లో నడ­వ­డం వల్లే తాను స్టా­న్‌­ఫో­ర్డ్‌ యూ­ని­వ­ర్సి­టీ­లో చదు­వు­కో­గ­లి­గా­న­ని మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. పి­ల్లల జీ­వి­తా­ల­ను తీ­ర్చి­ది­ద్దే­ది ఉపా­ధ్యా­యు­లే­న­ని, వి­ద్యా­శా­ఖ­లో ఏడా­ది­లో అనేక సం­స్క­ర­ణ­లు తీ­సు­కొ­చ్చా­మ­ని తె­లి­పా­రు. అం­ద­రం కలి­సి కట్టు­గా ఆం­ధ్రా మో­డ­ల్ వి­ద్యా వ్య­వ­స్థ­ను ప్ర­పం­చా­ని­కి చా­టు­దా­మ­ని మం­త్రి స్ప­ష్టం చే­శా­రు. చదు­వు ఒక వ్య­క్తి­ని పే­ద­రి­కం నుం­డి బయ­ట­కి తీ­సు­కొ­స్తుం­ద­న­టా­ని­కి ప్ర­త్య­క్ష ఉదా­హ­రణ ఏపీ­జే అబ్దు­ల్ కలాం అని తె­లి­పా­రు. గు­రు­వు­లే చూ­పిం­చిన దారే నన్ను ఈ రోజు ఈ స్థా­యి­లో ని­ల­బె­ట్టిం­ద­ని గు­ర్తు చే­సు­కు­న్నా­రు.

Tags

Next Story