CBN: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి

రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే వారే నాయకులుగా రాణిస్తారని ఆయన చెప్పారు. ఈమేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని నేతలకు తెలిపారు. 'పేదల సేవలో' కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం ప్రస్తుతం 25 వేలకు చేరిందని చంద్రబాబు వెల్లడించారు.
పించన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం 25వేలకు చేరిందనీ, ఇది 35వేలకు పెరగాలని చంద్రబాబు కోరారు. నేతలు నిరంతరం ప్రజలతోనే ఉండాలనీ. పింఛన్ల పంపిణీ కూడా.. పేదల సేవ కిందకే వస్తుందనీ.. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా.. పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే వారే నాయకులుగా రాణిస్తారని అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఐతే.. గత నెలలో కూడా సీఎం ఇలాగే సూచించినా 23 మంది ఎమ్మెల్యేలు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొనలేదు. వారిపై చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు గానీ.. ఇప్పటివరకూ అలాంటిదేదీ జరగలేదు. ప్రతి నెలా ఒకటో తేదీన ఏదైనా జిల్లాకు వెళ్లి పింఛను ఇచ్చే సీఎం చంద్రబాబు.. ఈసారి ఏలూరు జిల్లాకి వెళ్తున్నారు. డిసెంబర్ 1న ఆన.. ఏలూరు జిల్లాలో జరిగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందుగా.. ఉంగుటూరు మండలం గొల్లగూడెంకి వెళ్లి.. నేతలు అధికారుల్ని కలుస్తారు.
చంద్రబాబు కీలక నిర్ణయం
మూడు ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాము. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మూడు ప్రాంతాలు ఏవి, జోన్ల వివరాలు ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. ఉత్తరాంధ్ర, కోస్తా , రాయలసీమ ప్రాంతాలకు జోన్లను ఏర్పాటు చేయవ్చచు. ఈ జోన్ల ద్వారా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉన్న మాట నిజమేనన్నారు. నాతో సమావేశం తర్వాత రైతులకు అన్నింటిపైనా స్పష్టత వచ్చింది.. రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. రెండో దశ భూసమీకరణ ఉపయోగాలను రైతులకు వివరించా.. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకూడదన్నారు. అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారని సీఎం తెలిపారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుంది.. రాజధాని అభివృద్ధి ఇక అనస్టాపబుల్ అని స్పష్టం చేశారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని.. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

