CBN: జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించండి

CBN: జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించండి
X
ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు... సంస్కరణల ఉత్సవ్ చేపట్టాలన్న సీఎం... 60 వేల సమావేశాలు చేపట్టాలని ఆదేశం

తె­లు­గు­దే­శం పా­ర్టీ ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, గ్రా­మ­స్థా­యి కా­ర్య­క­ర్త­ల­తో ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు టె­లీ­కా­న్ఫ­రె­న్స్ ని­ర్వ­హిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా టీ­డీ­పీ నే­త­ల­కు పలు కీలక అం­శా­ల­పై సీఎం చం­ద్ర­బా­బు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ‘‘పా­ర్టీ కా­ర్య­క­ర్త­లై­నా, నా­య­కు­లై­నా ప్ర­జ­ల­కు దగ్గ­ర­గా ఉం­డా­లి. ఎన్ని­కల సమ­యం­లో­నే ప్ర­జల వద్ద­కు వె­ళ్తా­నం­టే ప్ర­జ­లు హర్షిం­చ­రు. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­ను ప్ర­జ­ల­కు కా­ర్య­క­ర్త­లు వి­వ­రిం­చా­లి. కూ­ట­మి పా­ర్టీ­లు జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణల ఉత్స­వ్‌ ప్ర­చా­రం చే­ప­ట్టా­లి. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 60 వేల సమా­వే­శా­లు పె­ట్టి ప్ర­జ­ల­కు వి­వ­రిం­చా­లి. 11 మంది వై­సీ­పీ ఎమ్మె­ల్యే­లు శా­స­న­స­భ­కు రారు. ఆ పా­ర్టీ ఎమ్మె­ల్సీ­లు మా­త్రం సభకు వస్తు­న్నా­రు.. ఇదేం ద్వం­ద్వ వై­ఖ­రి?’’ అని చం­ద్ర­బా­బు ప్ర­శ్నిం­చా­రు. కేం­ద్ర­ప్ర­భు­త్వం తీ­సు­కు­వ­చ్చిన నూతన జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో పేద, మధ్య తర­గ­తి ప్ర­జ­ల­కు పె­ద్దఎ­త్తున లబ్ధి జరు­గు­తోం­ద­ని ఉద్ఘా­టిం­చా­రు. దే­శం­లో ఇదొక నూతన అధ్యా­య­మ­ని చె­ప్పు­కొ­చ్చా­రు. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో ఎన్డీఏ ప్ర­భు­త్వం తీ­సు­కు­వ­చ్చిన ఈ మా­ర్పు­ల­ను ప్ర­జ­ల­కు వి­వ­రిం­చి చె­ప్పా­ల­ని సూ­చిం­చా­రు. జీ­ఎ­స్టీ ఉత్స­వ్‌­లో భా­గం­గా జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­ను వి­వ­రి­ద్దా­మ­ని మా­ర్గ­ని­ర్దే­శం చే­శా­రు. వై­సీ­పీ హయాం­లో అవ­లం­బిం­చిన అస­మ­ర్థ వి­ధా­నా­ల­తో ప్ర­జ­ల­పై వి­ద్యు­త్‌ ఛా­ర్జీల భారం పడిం­ద­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. వి­ద్యు­త్‌ రం­గా­న్ని గా­డిన పె­ట్టి అనేక సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చా­మ­ని చె­ప్పా­రు.

తక్కువ ధరకు వి­ద్యు­త్‌ కొ­ను­గో­ళ్లు చే­ప­ట్టా­మ­ని.. దీం­తో రూ.వె­య్యి కో­ట్లు ఆదా అయి­న­ట్లు తె­లి­పా­రు. భవి­ష్య­త్తు­లో ప్ర­జ­ల­పై రూ.వె­య్యి కో­ట్ల భా­రా­న్ని తగ్గి­స్తు­న్నా­మ­న్నా­రు. ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న ప్ర­తి కా­ర్య­క్ర­మా­న్ని ప్ర­జ­ల్లో­కి తీ­సు­కె­ళ్లే బా­ధ్య­త­ను కా­ర్య­క­ర్త­లు తీ­సు­కో­వా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. కేం­ద్రం తీ­సు­కొ­చ్చిన జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో పేద, మధ్య తర­గ­తి ప్ర­జ­ల­కు పె­ద్ద ఎత్తున లబ్ధి జరు­గు­తుం­ద­ని, దే­శం­లో నూతన అధ్యా­య­మ­ని కొ­ని­య­డా­రు. జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ­ల­తో ఎన్డీ­యే ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన ఈ మా­ర్పు­ల­ను ప్ర­జ­ల­కు వి­వ­రిం­చి చె­ప్పా­ల­ని సూ­చిం­చా­రు. కనీ­సం రా­ష్ట్ర వ్యా­ప్తం­గా 60 వేల సమా­వే­శా­లు పె­ట్టి ప్ర­జ­ల­కు వి­వ­రిం­చా­ల­న్నా­రు. కూ­ట­మి పా­ర్టీ­లు ఉమ్మ­డి­గా జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణ ఉత్స­వ్ ప్ర­చా­రా­న్ని ని­ర్వ­హిం­చా­ల­న్నారు.

Tags

Next Story