CBN: "సాంకేతిక ద్వారా సుపరిపాలన"`

శాఖల వారీగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం ఆదేశం

శా­ఖ­ల­వా­రీ­గా లక్ష్యా­లు, సా­ధిం­చిన అభి­వృ­ద్ధి­పై దృ­ష్టి పె­ట్టా­ల­ని మం­త్రు­లు, ఉన్నా­ధి­కా­రు­ల­ను సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. సచి­వా­ల­యం­లో డేటా-డ్రి­వె­న్‌ గవ­ర్నె­న్స్‌ - పా­ల­న­లో టె­క్నా­ల­జీ - ఆర్టీ­జీ­ఎ­స్‌­తో సమ­న్వ­యం­పై మం­త్రు­లు, అన్ని జి­ల్లాల కలె­క్ట­ర్లు, ఉన్న­తా­ధి­కా­రు­ల­తో ఆయన వీ­డి­యో కా­న్ఫ­రె­న్స్‌ ని­ర్వ­హిం­చా­రు. శాఖల వా­రీ­గా ఎవరు, ఎన్ని దస్త్రా­లు ఎన్ని రో­జు­ల్లో క్లి­య­ర్‌ చే­స్తు­న్నా­రో తె­ల­పా­ల­న్నా­రు. ‘‘సాం­కే­తి­కత ద్వా­రా ప్ర­జ­ల­కు సు­ప­రి­పా­లన అం­దిం­చా­లి. గ్రామ సచి­వా­ల­యా­న్ని వి­జ­న్‌ యూ­ని­ట్‌­గా మా­ర్చి సమ­ర్థం­గా వా­డా­లి. ఇటీ­వల తు­పా­ను­లో సాం­కే­తి­క­త­తో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిం­చ­గ­లి­గాం. డేటా ఆధా­రిత పాలన అత్యంత కీ­ల­క­మైన అం­శం­గా మా­రిం­ది. రి­య­ల్‌­టై­మ్‌ గవ­ర్నె­న్స్‌­లో పౌ­రుల డేటా పొం­దు­ప­రి­చాం. 42 వి­భా­గా­ల్లో డేటా మొ­త్తం అం­దు­బా­టు­లో­కి తె­చ్చాం. డి­జి­లా­క­ర్‌­లో వి­ద్యా­ర్థుల అన్ని ధ్రు­వ­ప­త్రా­లు, ప్ర­జల హె­ల్త్‌ రి­కా­ర్డు­లు ఉం­డా­లి. వై­ద్యు­డి వద్ద­కు వె­ళి­తే డి­జి­లా­క­ర్‌­లో హె­ల్త్‌ రి­కా­ర్డు­లు లభిం­చా­లి. వీ­లై­నంత త్వ­ర­గా దస్త్రా­లు పూ­ర్తి చే­స్తే ప్ర­భా­వ­వం­తం­గా ఉం­టుం­ది. డేటా లే­క్‌­లో అన్ని వి­భా­గాల డేటా తె­లు­సు­కో­వ­చ్చు. ప్ర­మా­దా­లు జర­గ­కుం­డా టె­క్నా­ల­జీ­ని వి­ని­యో­గిం­చా­లి. రూ­ల్‌ ప్ర­కా­రం లే­క­పో­వ­డం వల్ల 60-70 శాతం పను­లు లి­టి­గే­ష­న్ల­లో­ఉం­టు­న్నా­యి. ఏఐని వా­డి­తో జీ­వోల ద్వా­రా లి­టి­గే­ష­న్లు రా­కుం­డా ని­వా­రిం­చ­వ­చ్చు.’’ అని చం­ద్ర­బా­బు చె­ప్పా­రు.

ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు

ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ టీచర్లను నియమించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక విద్యను బలోపేతం చేయటానికి ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో 2,837 పాఠశాలల్లో ఈ ప్రక్రియను చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 వేతనం ఇవ్వనున్నారు. కంప్యూటర్‌ వినియోగంపై పూర్తి అవగాహన ఉన్న అర్హులను తీసుకోనున్నారు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడానికి, పొరుగు సేవల విధానంలో ఈ కంప్యూటర్ టీచర్లను నియమించనున్నారు.

"తక్షణ సాయం చేయండి"

పత్తి రై­తుల కష్టా­ల­పై కేం­ద్ర­మం­త్రి గి­రి­రా­జ్ సిం­గ్‌­కు ఏపీ వ్య­వ­సా­య­మం­త్రి అచ్చె­న్నా­యు­డు లేఖ రా­శా­రు. 2025–26 ఖరీ­ఫ్ సీ­జ­న్‌­లో రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 4.56 లక్షల హె­క్టా­ర్ల­లో పత్తి సాగు జర­గిం­ద­ని, సు­మా­రు 8 లక్షల మె­ట్రి­క్ టన్నుల ఉత్ప­త్తి అం­చ­నా ఉం­ద­ని లే­ఖ­లో పే­ర్కొ­న్నా­రు. అయి­తే మొం­థా తు­ఫా­న్ ప్ర­భా­వం­తో పత్తి పంట తీ­వ్రం­గా దె­బ్బ­తి­న­డం­తో రై­తు­లు కనీస మద్ద­తు ధర కంటే తక్కువ ధర­ల­కు పత్తి­ని వి­క్ర­యిం­చా­ల్సి వస్తోం­ద­ని తె­లి­పా­రు. ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే సీఎం యాప్ ఆధా­ర్ ఆధా­రిత ఈ-పంట వ్య­వ­స్థ ద్వా­రా పత్తి కొ­ను­గో­ళ్లు పూ­ర్తి­గా డి­జి­ట­లై­జ్ చే­సిం­ద­ని చె­ప్పా­రు. ఈ మే­ర­కు కేం­ద్ర ప్ర­భు­త్వం ప్ర­వే­శ­పె­ట్టిన కా­పా­స్ కి­సా­న్ యాప్ ను రా­ష్ట్ర సీఎం యా­ప్తో అను­సం­ధా­నం చే­సిన తర్వాత కొ­న్ని సాం­కే­తిక సమ­స్య­లు తలె­త్తి రై­తు­లు ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­ర­ని అచ్చె­న్న వి­వ­రిం­చా­రు. రై­తుల సౌ­క­ర్యం కోసం ప‌లు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని కో­రా­రు. కా­పా­స్ కి­సా­న్ యాప్ నుం­డి సీఎం యాప్ కు రైతు వి­వ­రా­లు రి­య­ల్ టై­మ్‌­లో సమ­న్వ­యం అయ్యే­లా చే­యా­ల­న్నా­రు.

Tags

Next Story