CBN: తప్పు చేయను... తప్పు చేస్తే వదలను

CBN: తప్పు చేయను... తప్పు చేస్తే వదలను
X
శాసనసభలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ.. అందరూ వైసీపీ ప్రభుత్వ బాధితులే: సీఎం... తాను న్యాయబద్దంగా ఉంటానన్న చంద్రబాబు... చట్టాలకు మరింత పదును పెడతాం

జగన్ ప్ర­భు­త్వం­లో తానే మొ­ద­టి బా­ధి­తు­డి­ని అని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. శా­స­న­స­భ­లో ఆయన మా­ట్లా­డు­తూ.. తాను ఎప్పు­డూ తప్పు చే­య­న­ని, న్యా­య­బ­ద్ధం­గా సరి­గ్గా ఉం­టా­న­ని చె­ప్పా­రు. ఎవ­రై­నా తప్పు­లు చే­స్తే మా­త్రం వారి గుం­డె­ల్లో రై­ళ్లు పరు­గె­త్తి­స్తా­మ­న్నా­రు. వై­సీ­పీ పా­ల­న­లో పవన్ కల్యా­ణ్ ను కూడా హై­ద­రా­బా­ద్ నుం­చి రా­కుం­డా అడ్డు­కు­న్నా­ర­ని చె­ప్పా­రు. ఇలాం­టి సం­ఘ­ట­న­లు ఒకటి కాదు అనే­కం ఉన్నా­య­న్నా­రు. తనది కక్ష రా­జ­కీ­యా­లు కా­ద­ని, బా­ధ్యత కలి­గిన నా­య­కు­ణ్ణి కా­బ­ట్టే ప్ర­జ­లు నా­లు­గో సారి నన్ను సీఎం గా ఎన్ను­కు­న్నా­ర­న్నా­రు. " 2003 లో అలి­పి­రి­లో యా­క్సి­డెం­ట్ అయిం­ది.. నేను మరో ము­గ్గు­రు ఎమ్మె­ల్యే­లు ఉన్నాం. యా­క్సి­డెం­ట్ తర్వాత నేనే లేచి అం­బు­లె­న్స్ లో పడు­కు­న్నా ఏమి జరి­గిం­ది అన్నా­ను. నక్స­ల్స్ బ్లా­స్ట్ అన్నా­రు.. 23 క్లై­మో­ర్ మై­న్స్ బ్లా­స్ట్ చే­సి­నా నేను బయట పడ్డ.. వేం­క­టే­శ్వర స్వా­మి మహిమ ఉందా అంటే.. ఉం­ద­నే చె­ప్పా­లి" అని సీఎం అన్నా­రు. రా­య­ల­సీ­మ­లో ఫ్యా­క్ష­న్ లే­కుం­డా చె­య్యా­లి అను­కు­న్న… పరి­టాల రవి­ని ఆఫీ­స్ లో చం­పే­శా­రు.. వా­ళ్ళు చే­సిన పనే మనం చే­స్తే న్యా­యం జర­గ­ద­న్నా­రు. రా­య­ల­సీ­మ­లో ఫ్యా­క్ష­న్ లే­కుం­డా చె­య్యా­లి అను­కు­న్న… పరి­టాల రవి­ని ఆఫీ­స్ లో చం­పే­శా­రు.. వా­ళ్ళు చే­సిన పనే మనం చే­స్తే న్యా­యం జర­గ­ద­న్నా­రు.

నాకే నోటీసులు ఇస్తాడా..?

సీఐ శం­క­ర­య్య ఏకం­గా ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­కు లీ­గ­ల్‌ నో­టీ­సు­లి­వ్వ­డం పో­లీ­సు­శా­ఖ­లో కల­క­లం రే­పిం­ది. రా­ష్ట్ర చరి­త్ర­లో ఇలాం­టి పరి­ణా­మం ఎన్న­డూ జర­గ­లే­ద­నే వ్యా­ఖ్య­లు వి­ని­పి­స్తు­న్నా­యి. ఈ అం­శం­పై తా­జా­గా సీఎం చం­ద్ర­బా­బు అసెం­బ్లీ­లో స్పం­దిం­చా­రు. శం­క­ర­య్య మా­ట్లా­డ­డా­ని­కి ఎంత ధై­ర్యం ఉం­డా­ల­ని తనకి లీ­గ­ల్ నో­టీ­సు­లు ఇచ్చిన శం­క­ర­య్య పై సీఎం ఫైర్ అయ్యా­రు. శం­క­ర­య్య అనే వ్య­క్తి­ని తాను ఎప్పు­డూ చూ­డ­లే­ద­న్నా­రు. నే­ర­స్తు­ల­కు అం­డ­గా ఉండే రా­జ­కీయ నా­య­కు­ల­ను ఇంత వరకు చూ­డ­లే­ద­ని.. కానీ ఇపు­డు నేర ప్ర­వు­త్తి ఉన్న వారే రా­జ­కీ­యా­ల­కు వస్తు­న్నా­ర­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. సీఐ డ్యూ­టీ­లో ఉన్నా­డా లేదా? సీన్ ఆఫ్ అఫె­న్స్ ను ఎవరు ప్రొ­టె­క్ట్ చే­యా­లి..? అని చం­ద్ర­బా­బు మం­డి­ప­డ్డా­రు. సం­బం­ధిత పో­లీ­స్ స్టే­ష­న్ అధి­కా­రి కి సం­బం­ధం లేదా..? అని ని­ల­దీ­శా­రు. నే­ర­స్తు­ల­తో కలి­సి నా మీ­ద­నే కేసు పె­ట్టే స్థా­యి­కి పరి­స్థి­తి వచ్చిం­దం­టే రా­ష్ట్రం ఎటు పో­తుం­ద­ని మం­డి­ప­డ్డా­రు.. కా­ర­ణం చె­బి­తే పో­లీ­సు­లు అను­మ­తి ఇస్తా­రు.. కానీ సమా­చా­రం ఇవ్వ­కుం­డా యా­త్ర­లు చే­స్తే జరి­గే పరి­ణా­మా­ల­కు ఎవరు బా­ధ్యు­లు..? అని సీఎం ప్ర­శ్నిం­చా­రు. రౌడీ ఇజం చేసే వా­రం­తా రా­జ­కీ­యం చే­స్తు­న్నా­రు.. మహిళ పై నే­రా­ల­కు పా­ల్ప­డు­తు­న్న 343 మందికి శి­క్ష­లు పడ్డా­య­న్నా­రు. ప్ర­జా­స్వా­మ్యా­న్ని కా­పా­డు­కో­వా­లం­టే పా­ర్టీ­లు ఉం­డా­ల­ని.. కూ­ట­మి ప్ర­భు­త్వం పద్ధ­తి ప్ర­కా­రం పని చే­స్తోం­ద­ని సీఎం తె­లి­పా­రు.

Tags

Next Story