CBN: దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్

CBN: దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్
X
మేం నిమిత్తమాత్రులం.. దేవుడే శిక్షిస్తాడన్న చంద్రబాబు... ఎవర్నీ వదిలేది లేదు-చూస్తూ ఊరుకునేది లేదన్న సీఎం

తి­రు­మల లడ్డూ కల్తీ వ్య­వ­హా­రం­లో వై­సీ­పీ నే­త­లు బు­కా­యి­స్తే వా­స్త­వా­లు మా­ర­తా­యా అని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు ప్ర­శ్నిం­చా­రు. దౌ­ర్జ­న్యం, రౌ­డీ­యి­జం చే­స్తే సహిం­చ­బో­న­ని చె­ప్పా­రు. దే­వు­డి­తో పె­ట్టు­కుం­టే పరి­ణా­మా­లు తీ­వ్రం­గా ఉం­టా­య­ని హె­చ్చ­రిం­చా­రు. తి­రు­మల పవి­త్ర­త­ను కా­పా­డు­కో­వా­ల్సిన బా­ధ్యత అం­ద­రి­పై ఉం­ద­న్నా­రు. లడ్డూ కల్తీ వ్య­వ­హా­రం నే­ప­థ్యం­లో డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌, బీ­జే­పీ ఏపీ అధ్య­క్షు­డు మా­ధ­వ్‌, పలు­వు­రు మం­త్రు­ల­తో కలి­సి సీఎం కీలక భేటీ ని­ర్వ­హిం­చా­రు. అనం­త­రం ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో చం­ద్ర­బా­బు మా­ట్లా­డా­రు. ‘‘తప్పు­చే­సి దాని నుం­చి ప్ర­జల దృ­ష్టి­ని మర­ల్చేం­దు­కు మాపై వై­కా­పా నే­త­లు దు­ష్ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. బూ­తు­లు తి­ట్టి­నా మేం భరిం­చా­లా? దో­షు­ల­ను అన్ని వి­ధా­లు­గా శి­క్షి­స్తాం. ఈ వ్య­వ­హా­రం­లో చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సీ­బీఐ మాకు ఓ ని­వే­దిక పం­పిం­ది. ఏక సభ్య కమి­ష­న్‌ వేసి అన్నీ పరి­శీ­లి­స్తాం. అవ­స­ర­మై­తే కో­ర్టు­లో కూడా అద­న­పు సమా­చా­రం చే­రు­స్తాం. ఇది ప్ర­జల మనో­భా­వా­ల­కు సం­బం­ధిం­చిన అంశం. ఒక­ప్పు­డు ఏడు కొం­డ­లు కాదు.. రెం­డు కొం­డ­ల­ని అసెం­బ్లీ­లో మా­ట్లా­డా­రు. భక్తుల మనో­భా­వా­ల­తో ఆడు­కో­వ­ద్ద­ని ఆనా­డే చాలా స్ప­ష్టం­గా చె­ప్పాం. వై­కా­పా అధి­కా­రం­లో­కి వచ్చాక ఆ పి­చ్చి పరా­కా­ష్ఠ­కు చే­రిం­ది. వి­గ్ర­హాల ధ్వం­సా­న్ని ప్ర­శ్ని­స్తే హే­ళ­న­గా మా­ట్లా­డా­రు. తప్పు చే­సిన వా­ళ్ల­పై చర్య­లు తీ­సు­కో­వా­ల్సిం­ది పోయి మా­పై­నే ఎదు­రు­దా­డి­కి ది­గా­రు. లడ్డూ కల్తీ ప్ర­జల మనో­భా­వా­ల­కు ము­డి­ప­డిన అం­శ­మ­ని ఆయన చె­ప్పా­రు. శ్రీ­వా­రి తమ ఇంటి కు­ల­దై­వ­మ­ని, 2003లో తన హత్యా­య­త్నం జరి­గి­తే ఆయనే బతి­కిం­చా­ర­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­శా­రు. వై­సీ­పీ పా­ల­న­లో ఆ పా­ర్టీ నే­త­లు రె­చ్చి­పో­యి ప్ర­వ­ర్తిం­చా­ర­ని ఆయన ఆరో­పిం­చా­రు. వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ తప్పు చేసి తమ­ల్ని క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­య­డ­మేం­ట­ని ప్ర­శ్నిం­చా­రు. తమను బూ­తు­లు తి­ట్టి సె­లైం­ట్‌­గా ఉం­డ­మం­టు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. నె­య్యి కల్తీ­పై వై­సీ­పీ­కి సీ­బీఐ క్లీ­న్ చిట్ ఇవ్వ­లే­ద­న్నా­రు.

గత ఐదే­ళ్ల కా­లం­లో తి­రు­మల శ్రీ వేం­క­టే­శ్వర స్వా­మి­కి సం­బం­ధిం­చి అనేక అప­చా­రా­లు జరి­గా­య­ని చం­ద్ర­బా­బు ఆరో­పిం­చా­రు. భక్తుల మనో­భా­వా­ల­తో ఆడు­కో­వ­ద్ద­ని పలు­మా­ర్లు హె­చ్చ­రిం­చి­నా, అప్ప­టి పా­ల­కు­లు పట్టిం­చు­కో­లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. వారి ప్ర­వ­ర్తన పరా­కా­ష్ట­కు చే­రిం­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. రా­ము­డి వి­గ్ర­హా­ని­కి సం­బం­ధిం­చిన ఘట­న­పై వా­స్త­వా­లు తె­లు­సు­కో­వ­డా­ని­కి వె­ళ్లిన తనపై కే­సు­లు పె­ట్టా­ర­ని, అం­త­ర్వే­ది­లో రథం దగ్ధ­మై­తే కం­ది­రీ­గ­లు కా­ర­ణ­మ­ని చె­ప్ప­డం ఎంత అవ­మా­న­క­ర­మో ప్ర­జ­లే ఆలో­చిం­చా­ల­ని అన్నా­రు. ఆం­జ­నే­యు­డి వి­గ్ర­హా­ని­కి జరి­గిన నష్టం వి­ష­యా­న్ని కూడా ఆయన ప్ర­స్తా­విం­చా­రు. అది కే­వ­లం బొ­మ్మే కదా, ఇం­కొ­క­టి పె­ట్టు­కో­వ­చ్చ­ని మా­ట్లా­డ­టం దే­వు­డి­పై ఉన్న ని­ర్ల­క్ష్యా­న్ని స్ప­ష్టం­గా చూ­పి­స్తుం­ద­ని అన్నా­రు. బ్రి­టి­ష్ పా­ల­కు­లు కూడా తి­రు­మల శ్రీ వేం­క­టే­శ్వర స్వా­మి జో­లి­కి వె­ళ్ల­లే­ద­ని గు­ర్తు చే­స్తూ, అలాం­టి పవి­త్ర స్థ­లం­పై అప­చా­రా­లు జర­గ­డం అత్యంత బా­ధా­క­ర­మ­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. తి­రు­మల లడ్డూ ప్ర­సా­దా­ని­కి సం­బం­ధిం­చి నె­య్యి కల్తీ వ్య­వ­హా­రా­న్ని చం­ద్ర­బా­బు తీ­వ్రం­గా ఖం­డిం­చా­రు. అది మహా­పా­ప­మ­ని స్ప­ష్టం­గా చె­ప్పా­రు. ఈ వి­ష­యం­లో సీ­బీఐ ఎక్క­డా కల్తీ జర­గ­లే­ద­ని చె­ప్ప­లే­ద­ని, అయి­నా కొం­ద­రు అస­త్యా­న్ని ప్ర­జ­ల్లో నమ్మిం­చే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు.

Tags

Next Story