CBN: అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ

CBN:  అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ
X
పోలవరం, అమరావతి సహా కీలక ప్రాజెక్టులపై విస్తృత చర్చ

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలపై కేంద్రంతో సమన్వయం పెంచే దిశగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో చురుగ్గా సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్ర విభజన హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రత్యేకంగా అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. రాజధానిలో మరిన్ని కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. అలాగే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన సీఎం, కేంద్రం నుంచి నిధుల మద్దతు మరింత పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విడుదలలో జాప్యం జరగకుండా చూడాలని కూడా చంద్రబాబు కోరినట్లు సమాచారం. కోఆపరేటివ్ శాఖ ద్వారా రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ హామీల అమలు అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

సింగపూర్‌ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌


మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్‌ చేరుకున్నారు. ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీని తీసుకొచ్చినందుకు లోకేశ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులే లక్ష్యంగా పలువురు ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ కానున్నారు. ఎంఐటీలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ భేటీలో పాల్గొంటారు.

Tags

Next Story