CBN: గర్వంగా ఉంది మై డియర్ భు..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నారు. భువనేశ్వరికి ప్రతిష్టాత్మక ఐఓడి ఫెలోషిప్ అవార్డు లభించింది. 2025 సంవత్సరానికి గాను ఈ గౌరవ పురస్కారానికి ఆమె ఎంపికైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు భువనేశ్వరి కి అభినందనలు తెలియజేశారు.
భావోద్వేగ సందేశం
" మై డియర్ భూ" అంటూ భువనేశ్వరి పై ప్రేమను వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఆమె సాధించిన ఘనత తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐ ఓ డి ఫెలోషిప్ అవార్డు 2025 తో నీకు గుర్తింపుని ఇచ్చినందుకు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. నీ అంకితభావం సమగ్రత మరియు శక్తి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని చంద్రబాబు భువనేశ్వరిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనక ఒక బలమైన స్త్రీ ఉందని చాలామంది చెబుతారని, కానీ నువ్వు నా విజయం వెనుక కాదు, ఎన్నో మైళ్ళు ముందు ఉన్నావంటూ చంద్రబాబు భువనేశ్వరిని కొనియాడారు. అవార్డును అందుకునే ఘడియ కోసం ఎదురు చూస్తాను మేనేజింగ్ ట్రస్టీ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న భువనేశ్వరి యూకే కు చెందిన ఐఓడి ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4వ తేదీన అందుకోనున్నారు. భువనేశ్వరికి అవార్డు రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com