CBN: పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి

CBN: పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి
X
కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం... కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం... వివరాలు సమగ్రంగా ఉండాలన్న బాబు

సూ­ప­ర్ సి­క్స్‌­ను సూ­ప­ర్ సక్సె­స్ చే­శాం. వె­ను­క­బ­డిన వర్గా­ల­ను ముం­దు­కు తే­వ­టా­ని­కే సూ­ప­ర్ సి­క్స్ పథ­కా­ల­ను తీ­సు­కొ­చ్చాం. సా­మా­జిక భద్రత పె­న్ష­న్ల­ను మొ­ద­టి తే­దీ­నే ఇస్తు­న్నాం’అని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు వె­ల్ల­డిం­చా­రు.‘తల్లి­కి వం­ద­నం ద్వా­రా ఎం­త­మం­ది పి­ల్ల­లు ఉంటే అం­ద­రి­కీ ఇస్తు­న్నాం. అన్న­దాత సు­ఖీ­భవ ద్వా­రా రై­తు­ల­కు రెం­డు వి­డ­త­ల్లో రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీ­శ­క్తి, మెగా డీ­ఎ­స్సీ, కా­ని­స్టే­బు­ల్ ఉద్యో­గా­లు కూడా భర్తీ చే­శాం’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు తె­లి­పా­రు.ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు అధ్య­క్ష­తన సచి­వా­ల­యం­లో 5వ కలె­క్ట­ర్ల కా­న్ఫ­రె­న్స్ ప్రా­రం­భ­మైం­ది. ఈ సద­స్సు­ను ఉద్దే­శిం­చి సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు ప్ర­సం­గిం­చా­రు.జి­ల్లాల కలె­క్ట­ర్ల సద­స్సు­లో మొ­క్కు­బ­డి చర్చ­లు కా­కుం­డా అర్థ­వం­త­మైన సమీ­క్ష, చర్చ­లు జర­గా­లి. అధి­కా­రు­లు, ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు ఎవ­రై­నా ని­త్య వి­ద్యా­ర్ధి­గా­నే ఉం­డా­లి... ని­రం­త­రం వి­విధ అం­శా­ల­ను తె­లు­సు­కుం­టూ అభి­వృ­ద్ధి­లో భా­గ­మ­వ్వా­లి’అని సీఎం సూ­చిం­చా­రు.అభి­వృ­ద్ధి ఒక­వై­పు... సం­క్షే­మం మరో­వై­పు జరు­గు­తోం­ది అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు తె­లి­పా­రు.

మంచి పేరు వచ్చేలా చూడాలి

జి­ల్లా­లు అను­స­రిం­చే బె­స్ట్ ప్రా­క్టీ­సె­స్ ఇతర ప్రాం­తా­ల్లో­నూ అమలు చే­యా­ల్సిన అవ­స­రం ఉంది..అని సీఎం చం­ద్ర­బా­బు జి­ల్లా కలె­క్ట­ర్ల సద­స్సు­లో మా­ట్లా­డా­రు. లక్ష్యా­ల­కు అను­గు­ణం­గా అమలు చే­స్తే 15 శాతం వృ­ద్ధి రేటు సాధన కష్టం కాదు. నీటి భద్రత, ఉద్యో­గాల కల్పన, అగ్రి­టె­క్ లాం­టి అం­శాల ద్వా­రా ఈ వృ­ద్ధి­ని సా­ధి­ద్ధాం. మన ప్ర­భు­త్వా­ని­కి వా­ర­స­త్వం­గా 70 శాతం మేర ధ్వం­స­మైన రో­డ్లు వచ్చా­యి. నీటి సమ­స్య­లు, మద్ధ­తు ధరలు లే­క­పో­వ­టం, భూ వి­వా­దా­లు, వి­ద్యు­త్ బి­ల్లు­లు ఎక్కువ రా­వ­టం లాం­టి సమ­స్య­లు కూడా గత ప్ర­భు­త్వం నుం­చి వా­ర­స­త్వం­గా పె­ద్ద ఎత్తున వచ్చా­యి. ఇప్పు­డు మనం నీటి భద్రత తె­చ్చాం, రై­తు­ల­కు మె­రు­గైన ధరలు దక్కే­లా చూ­స్తు­న్నాం. వి­ద్యు­త్ ఛా­ర్జీ­లు పెం­చ­క­పో­గా... తగ్గిం­చాం. ప్ర­భు­త్వం­పై ప్ర­జ­ల­కు పూ­ర్తి­స్థా­యి వి­శ్వ­స­నీ­యత వచ్చిం­ది. దీ­ని­ని కా­పా­డు­కో­వా­లి. ప్ర­జల నుం­చి వచ్చిన గ్రీ­వె­న్సు­ల­ను కూడా వే­గం­గా పరి­ష్క­రిం­చి పా­ర­ద­ర్శ­కం­గా ఆన్ లైన్ లో ఉం­చం­డి. లి­టి­గే­ష­న్ల­పై ప్ర­జ­ల్లో చై­త­న్యం పెం­చి వా­టి­ని పరి­ష్క­రిం­చు­కు­నే­లా అవ­గా­హన పెం­చు­దాం. చే­సిన పని­ని సా­మా­జిక మా­ధ్య­మా­ల్లో చె­ప్పు­కు­నే­లా చర్య­లు ఉం­డా­లి. ‘మనం చక్క­గా ప్ర­జ­ల­కు సే­వ­లం­ది­స్తు­న్నాం... కానీ సమ­ర్థ­వం­తం­గా పని చే­యా­ల్సిన అవ­స­రం ఉంది.’అని సీఎం పే­ర్కొ­న్నా­రు.

కలెక్టర్లే అంబాసిడర్లు

కలె­క్ట­ర్లు ప్ర­భు­త్వా­ని­కి అం­బా­సి­డ­ర్లు. ప్ర­భు­త్వం­పై సా­ను­కూ­లత రా­వా­లం­టే అధి­కా­రు­ల­దే కీ­ల­క­పా­త్ర. పొ­లి­టి­క­ల్ గవ­ర్నె­న్సు అనే­ది కీ­ల­కం..కలె­క్ట­ర్లు తమ ప్ర­తిభ ద్వా­రా కూ­ట­మి ప్ర­భు­త్వా­ని­కి మంచి పేరు వచ్చే­లా చూ­డా­లి. ప్ర­తీ ని­మి­షం నన్ను నేను బె­ట­ర్ గా తీ­ర్చి­ద్దు­కు­నే­లా సె­ల్ఫ్ అసె­స్మెం­ట్ చే­సు­కుం­టు­న్నా­ను. దే­శం­లో­ని అన్ని రా­ష్ట్రా­లు ఏపీ గు­రిం­చే చర్చిం­చు­కో­వా­లి. స్పే­స్, డ్రో­న్, ఎల­క్ట్రా­ని­క్స్, గ్రీ­న్ హై­డ్రో­జ­న్ సి­టీల ద్వా­రా పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షి­స్తు­న్నాం. ప్రీ­వెం­టి­వ్, క్యు­రె­టి­వ్, కా­స్ట్ ఎఫె­క్టి­వ్ మే­నే­జ్మెం­ట్ ద్వా­రా వై­ద్యా­రో­గ్యా­న్ని ప్ర­జ­ల­కు అం­దిం­చా­లి. ప్ర­జ­ల్లో సం­తృ­ప్తి­ని పెం­చే­లా పౌ­ర­సే­వ­ల­ను అం­దిం­చా­ల­ని కలె­క్ట­ర్ల­ను కో­రు­తు­న్నా­ను. ఇళ్లు లేని పే­ద­లు, రై­తు­లు, మహి­ళ­లు, పి­ల్ల­లు, యువత ఇలా అన్ని వర్గా­ల­కు మంచి చే­య­డం ద్వా­రా ప్ర­జ­ల్లో సా­ను­కూ­లత వస్తుం­ది. కొ­న్ని అం­శా­ల్లో ప్ర­జా­ప్ర­తి­ని­ధుల సే­వ­ల­ను కూడా వి­ని­యో­గిం­చు­కో­వా­లి. స్పీ­డ్ ఆఫ్ డె­లి­వ­రిం­గ్ గవ­ర్నె­న్సు అనే­ది చాలా ము­ఖ్యం..అని సీఎం పే­ర్కొ­న్నా­రు.

రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు

‘వి­శా­ఖ­లో ని­ర్వ­హిం­చిన భా­గ­స్వా­మ్య సద­స్సు­లో రూ.11.20 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వచ్చా­యి. ఎస్ఐ­పీ­బీల ద్వా­రా రూ.8.50 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­ను ఆమో­దిం­చాం. వీ­టి­ని క్లి­య­ర్ చే­య­టం­లో కలె­క్ట­ర్లు కూడా వే­గం­గా స్పం­దిం­చా­లి’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు తె­లి­పా­రు. ‘ఈజ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జి­నె­స్ నుం­చి స్పీ­డ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జి­నె­స్ వి­ధా­నా­ని­కి వచ్చాం. పె­ట్టు­బ­డు­లు పె­ట్టే­వా­రి­కి అం­డ­గా ఉండి గౌ­ర­విం­చా­లి... వే­గం­గా అను­మ­తు­లు ఇవ్వా­లి. డ్వా­క్రా, మె­ప్మా­ను ఇం­టి­గ్రే­ట్ చే­స్తు­న్నాం. పె­ద్ద ఎత్తున గృహ ని­ర్మా­ణా­లు చే­ప­డు­తు­న్నాం... అం­ద­రి­కీ ఇళ్లు అం­దే­లా చే­స్తు­న్నాం. పీ4 ద్వా­రా పే­ద­ల­కు చే­యూత అం­దిం­చ­ట­మే. ప్ర­తి­ప­క్షా­లు కూడా దీ­ని­ని అర్ధం చే­సు­కో­వా­లి’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు సూ­చిం­చా­రు. ‘ప్ర­ధా­ని నరేం­ద్ర మోడీ దే­శా­ని­కి సు­స్థి­ర­మైన పాలన అం­ది­స్తు­న్నా­రు. ఇప్పు­డు ప్ర­పం­చం అంతా భా­ర­త్ గు­రిం­చి ఆలో­చన చే­య­కుం­డా ముం­దు­కు వె­ళ్ల­టం లేదు. నా­లె­డ్జ్ ఎకా­న­మీ­కి బ్యా­క్ బోన్ ఐటీ, పె­ద్ద ఎత్తున స్థా­పిం­చిన కా­లే­జీల ద్వా­రా ఐటీ ని­పు­ణు­లు వచ్చా­రు’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు పే­ర్కొ­న్నా­రు. బా­ధ్యత కలి­గిన ప్ర­భు­త్వ­మం­టే అధి­కా­రా­లు దు­ర్వి­ని­యో­గం కాదు.. సద్వి­ని­యో­గం కా­వా­లి. అన్ని సే­వ­లు ఆన్‌­లై­న్‌­లో­నే అం­దిం­చే ప్ర­య­త్నం చే­స్తు­న్నాం’’ అని అన్నా­రు.

Tags

Next Story