CBN: దేశ ఐటీ హబ్‌గా విశాఖ

CBN: దేశ ఐటీ హబ్‌గా విశాఖ
X
విశాఖకు తరలివస్తున్న దిగ్గజ కంపెనీలు... శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన... ఇప్పటికే గూగుల్‌, టీసీఎస్‌, యాక్సంచర్.. తాము వచ్చాక 125 కంపెనీలు వచ్చాయి

త్వ­ర­లో­నే వి­శాఖ ఐటీ హబ్‌­గా మా­రు­తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. వి­శా­ఖ­కు గూ­గు­ల్‌, టీ­సీ­ఎ­స్‌, కా­గ్ని­జెం­ట్‌, యా­క్సం­చ­ర్‌ కం­పె­నీ­లు వస్తు­న్నా­య­ని చె­ప్పా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం వచ్చాక రూ.6.23 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వచ్చా­య­ని, 125 కం­పె­నీ­లు వచ్చా­య­ని పే­ర్కొ­న్నా­రు. రా­ష్ట్రం­లో లక్షల ఉద్యో­గా­లు వస్తు­న్నా­య­ని సీఎం చె­ప్పు­కొ­చ్చా­రు. పర్యా­టక ప్రా­జె­క్టు­ల­కు ఎక్కువ ప్రా­ధా­న్యత ఇస్తు­న్నా­మ­న్నా­రు. ప్ర­స్తు­తం రా­ష్ట్రం­లో­ని అన్ని జలా­శ­యా­లు నిం­డు­గా ఉన్నా­య­న్నా­రు. టెం­పు­ల్‌ టూ­రి­జం­ను 8 నుం­చి 20 శా­తా­ని­కి పెం­చా­ల­నే­ది లక్ష్యం అని, పర్యా­ట­కం­లో ఇంకా 50 వేల గదు­లు రా­వా­ల­న్నా­రు. దసరా ఉత్స­వా­ల్లో కో­ల్‌­క­తా, మై­సూ­ర్‌ సరసన వి­జ­య­వా­డ­ను చే­ర్చాం అని సీఎం చం­ద్ర­బా­బు వి­వ­రిం­చా­రు.

విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ

ఏవియేషన్ రంగంలోనూ ఒక యూనివర్సిటినీ విశాఖలో ఏర్పాటు చేయలని భావిస్తున్నామని చంద్రభాబు వెల్లడించారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లైఫ్ సైన్సెస్ తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరించామని వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో కియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో ఉత్పత్తి చేస్తోందన్న చంద్రబాబు. 2014 -19 మధ్య కియా కార్లను ఉత్పత్తి చేయటంతో పాటు ఓ మోడల్ టౌన్ షిప్ ను కూడా అభివృద్ధి చేసింది. ఇసుజు, హీరోమోటార్స్ లాంటి సంస్థలు కూడా మా హయాంలోనే ఏపీకి వచ్చాయన్నారు.

15 నెలల్లో 4 లక్షల 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం

కూ­ట­మి ప్ర­భు­త్వ 15 నెలల పా­ల­న­లో ఉద్యో­గాల కల్ప­న­పై చం­ద్ర­బా­బు మా­ట్లా­డా­రు. 15 నె­ల­ల్లో అన్ని రం­గా­ల్లో, అన్ని సె­క్టా­ర్ల­లో కలి­పి మొ­త్తం 4,71,574 మం­ది­కి ఉద్యో­గా­లు కల్పిం­చా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ఏయే రం­గా­ల్లో ఎన్నె­న్ని ఉద్యో­గా­లు ఇచ్చా­మ­నే వి­ష­యా­న్ని సె­క్టా­ర్ల వా­రీ­గా అసెం­బ్లీ­లో వి­వ­రిం­చా­రు. ప్ర­భు­త్వ, ప్రై­వే­ట్ రం­గా­ల్లో ఎన్ని ఉద్యో­గా­లు ఇచ్చా­మ­నే అం­శా­న్ని వె­ల్ల­డిం­చా­రు సీఎం చం­ద్ర­బా­బు.మెగా డీ­ఎ­స్సీ ద్వా­రా 15,941, వి­విధ ప్ర­భు­త్వ వి­భా­గా­ల్లో 9,093, పో­లీ­స్ శా­ఖ­లో 6,100 మం­ది­కి ఉద్యో­గా­లు కల్పిం­చి­న­ట్లు క్లా­రి­టీ ఇచ్చా­రు. స్కి­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్ - జాబ్ మే­ళాల ద్వా­రా 92,149 మం­ది­కి ఉద్యో­గా­లు వచ్చా­య­ని ప్ర­క­టిం­చా­రు. వర్క్ ఫ్రం హోం ద్వా­రా 5,500 మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు కల్పిం­చా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ప్రై­వే­ట్ సె­క్టా­ర్‌­లో పరి­శ్ర­మ­లు, ఫుడ్ ప్రా­సె­సిం­గ్, టూ­రి­జం, ఐటీ, ఎం­ఎం­స్ఎం­ఈ­లు, పు­న­రు­త్పా­దక వి­ద్యు­త్ రం­గా­ల్లో మొ­త్తం 3.48 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చా­మ­ని తె­లి­పా­రు. ఎవరూ ఎక్కడ, ఎప్పు­డూ ఉద్యో­గం పొం­దా­రు, ఏ జాబ్ చే­స్తు­న్నా­ర­నే సమ­స్త వి­వ­రా­ల­ను పో­ర్ట­ల్ ద్వా­రా కూడా వె­ల్ల­డి­స్తా­మ­ని చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. ఎక­నా­మి­క్ కా­రి­డా­ర్లు, పా­రి­శ్రా­మిక క్ల­స్ట­ర్ల­లో పె­ద్ద ఎత్తున పె­ట్టు­బ­డు­లు వస్తా­య­న్న చం­ద్ర­బా­బు.. వి­శాఖ, అమ­రా­వ­తి, తి­రు­ప­తి ఎక­నా­మి­క్ కా­రి­డా­ర్ల­లో ఆయా రం­గా­ల­కు చెం­దిన పె­ట్టు­బ­డు­లు రా­బో­తు­న్నా­య­న్నా­రు. 10 రా­ష్ట్ర స్థా­యి పె­ట్టు­బ­డుల ప్రో­త్సా­హక బో­ర్డు సమా­వే­శా­లు జరి­గా­య­ని రూ.6.23 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వచ్చా­య­ని.. 6.29 లక్షల మం­ది­కి ఉద్యో­గా­లు వస్తా­య­న్నా­రు.

Tags

Next Story