CBN: సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి

CBN: సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి
X
దుబాయ్ అభివృద్ధే మనకు ఆదర్శం: చంద్రబాబు... ఎడారి నుంచి స్వర్గం సృష్టించిన దేశం దుబాయ్.. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్

ఎడా­రి నుం­చి స్వ­ర్గా­న్ని సృ­ష్టిం­చిన దు­బా­య్.. మన అభి­వృ­ద్ధి­కి మా­ర్గ­ద­ర్శం కా­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అభి­లా­షిం­చా­రు. ఇన్వె­స్టో­పి­యా గ్లో­బ­ల్ ఏపీ సద­స్సు­లో పా­ల్కొ­న్న ము­ఖ్య­మం­త్రి కీలక ప్ర­సం­గం చే­శా­రు. సం­క్షో­భా­ల­నూ అవ­కా­శా­లు­గా మల­చు­కుం­టే­నే అభి­వృ­ద్ధి సా­ధ్య­మ­న్న సీఎం... నూ­త­నం­గా ఆలో­చిం­చ­డం వల్లే కొ­త్త ఆవి­ష్క­ర­ణ­లు పు­ట్టు­కొ­స్తు­న్నా­య­ని అన్నా­రు. యూ­ఏ­ఈ­తో భా­ర­త్‌­కు మంచి సం­బం­ధా­లు ఉన్నా­య­న్నా­రు. యూఏఈ జనా­భా­లో 40 శాతం మంది భా­ర­తీ­యు­లే అన్న­చం­ద్ర­బా­బు.. యూఏఈ అభి­వృ­ద్ధి­లో భా­ర­త్ భా­గ­స్వా­మ్యం ఉం­డ­డం సం­తో­ష­క­ర­మ­న్నా­రు. 1991లో ఆర్థిక సం­స్క­ర­ణ­లు, 1995లో టె­క్నా­ల­జీ రి­వ­ల్యూ­ష­న్‌­తో పరి­స్థి­తి మా­రిం­ద­ని గు­ర్తు చే­శా­రు. సద­స్సు­కు పలు దే­శాల ప్ర­తి­ని­ధు­లు రా­వ­డం చర్చ­ల­కు ప్రా­ధా­న్యత చే­కూ­ర్చిం­ద­ని తె­లి­పా­రు. దు­బా­య్ ను చూ­స్తుం­టే తనకు ఆసూయ వే­స్తుం­టుం­ద­న్న చం­ద్ర­బా­బు... దు­బా­య్‌­లో ఎడా­రి ప్రాం­తా­లు, బీ­చ్‌­లు పర్యా­ట­కు­ల­కు ఆహ్లా­ద­కర అను­భూ­తి­ని కలి­గి­స్తా­య­న్నా­రు. ప్ర­ధా­ని మోదీ సా­ర­థ్యం­లో భా­ర­త్‌­కు అపార అవ­కా­శా­లు వచ్చా­య­న్నా­రు. ఉమ్మ­డి ఏపీ­లో వి­జ­న్ 2020 రూ­పొం­దిం­చా­మ­న్న చం­ద్ర­బా­బు... వి­జ­న్ 2020తో రా­ష్ట్రా­భి­వృ­ద్ధి మె­రు­గు­ప­రి­చా­మ­ని... వి­క­సి­త్ భా­ర­త్ ద్వా­రా 2047 ప్ర­పం­చం­లో­నే మూడో అతి­పె­ద్ద ఆర్థిక వ్య­వ­స్థ­గా మా­రు­తుం­ద­న్నా­రు.

అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే

ఏపీ­లో 2026 జన­వ­రి నా­టి­కి క్వాం­టం కం­ప్యూ­టిం­గ్ వ్యా­లీ ఏర్పా­టు చే­స్తా­మ­న్నా­రు. వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్ ద్వా­రా 575 సే­వ­లు అం­ది­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఆగ­స్టు 15 నా­టి­కి అన్ని సే­వ­లు ఆన్‌­లై­న్‌­లో­నే అం­దు­బా­టు­లో­కి తీ­సు­కొ­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు.

ఇన్వెస్టోపియా సమ్మిట్ ఎందుకంటే?

ఇన్వె­స్టో­పి­యా గ్లో­బ­ల్ సమ్మి­ట్ సద­స్సు యూఏఈ ఆధ్వ­ర్యం­లో­ని ఇన్వె­స్టో­పి­యా గ్లో­బ­ల్ టా­క్స్ సి­రీ­స్‌­లో భా­గం­గా ని­ర్వ­హిస్తున్నారు. ఇది గతం­లో న్యూ­యా­ర్క్, జె­నీ­వా, న్యూ­ఢి­ల్లీ, ముం­బై, కైరో, రబా­ట్, హవా­నా, మి­ల­న్ వంటి నగ­రా­ల­లో జరి­గిన ఈవెం­ట్‌ల సమా­హా­రం­లో ఒకటి. ఈ సమ్మి­ట్‌­లో ఆర్థిక, సాం­కే­తిక, టూ­రి­జం, ఫ్యా­మి­లీ బి­జి­నె­స్, ఇ-కా­మ­ర్స్ వంటి రం­గా­ల్లో పె­ట్టు­బ­డి అవ­కా­శా­ల­పై చర్చ­లు జరి­గా­యి. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో పె­ట్టు­బ­డు­ల­ను ప్రో­త్స­హిం­చ­డా­ని­కి రా­ష్ట్ర ప్ర­భు­త్వం అను­స­రి­స్తు­న్న వి­ధా­నా­లు, మౌ­లిక సదు­పా­యా­లు, మరి­యు నై­పు­ణ్యం ఉన్న మానవ వన­రు­ల­ను హై­లై­ట్ చే­స్తూ చర్చ­లు సా­గా­యి.

Tags

Next Story