CBN: మెగా డీఎస్సీని హిట్ చేసి చూపించాం

మెగా డీఎస్సీ సాధ్యమా అన్నారు.. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేసిన.. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను అభినందించారు. డీఎస్సీ ద్వారా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. విజేతలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరూ ఎంతమంది టీచర్లను నియమించారో.. నేను ఒక్కడినే అంత మంది టీచర్లను నియమించాను అని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా రంగాన్ని నేను ఎప్పుడూ అశ్రద్ధగా చూడలేదు, నిర్లక్ష్యం చేయలేదన్నారు. మొదటి సూపర్ సిక్స్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అని.. అందులో భాగంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశానని చంద్రబాబు తెలిపారు. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి నారా లోకేశ్, టీంను ఆయన అభినందించారు. మగవాళ్లకంటే మహిళలే ఎక్కువగా చదువు చెప్పగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క టీచర్ ను కూడా నియమించకుండానే క్వాలిటీ పెరిగిపోయిందని ప్రచారం చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పేదరికంలేని సమాజం రావాలని చంద్రబాబు అన్నారు.
నా కోరిక మీ చేతుల్లో ఉంది..
”మీ కోరిక ఉద్యోగం. అది తీరింది. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. సిద్ధమా. మెగా డీఎస్సీ సాధ్యమా అన్నారు. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించాం. 150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్నుఅభినందిస్తున్నా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
డిఎస్సీ అంటే సీబీఎన్…
సీఎం చంద్రబాబు నాయుడు తనకు జీవితకాల గురువనిఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు చెప్పిన విధంగా ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. నవంబర్ లో టెట్ చేపడతామని.. వచ్చేఏడాది మళ్లీ పారదర్శకంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దేశానికి అధినేత అయినా సరే.. గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని హితవు పలికారు. తాను టెన్త్ క్లాస్ వరకూ నామమాత్రంగానే చదివానని, ఫండమెంటల్స్ లో నారాయణ లెసన్స్ చెప్పారని తెలిపారు. ఇక అమెరికా వెళ్లినపుడు ప్రొఫెసర్ రాజిరెడ్డి తనకు విద్యావ్యవస్థ గురించి చెప్పారన్నారు. విద్య గురించి తనకు అవగాహన ఉందని, అందుకే తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైనే పెట్టానన్నారు. సీబీఎన్ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే సీబీఎన్ అని కొనియాడారు. 150 రోజుల్లో 150 కేసులు పెట్టినా.. డీఎస్సీ పోస్టుల్ని భర్తీ చేసి చూపించామన్నారు. 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com