CBN: దేశం గర్వపడేలా అమరావతి నిర్మిస్తాం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారని , ఈ సందర్భంగా రైతులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో 15 బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఈ తరహాలో ల్యాండ్‌పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు హాజరయ్యారు. 15 సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని ప్రశంసించారు. 2028 నాటికి నిర్మాణాలు పూర్తి చేసి, దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. . ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతని.. రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించామన్నారు. రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించినట్లు తెలిపారు. ‘అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత కేంద్రానిదే.” అని చంద్రబాబు అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సహకరించాలి: చంద్రబాబు
సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకుని దేశానికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలాసీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని.. అందుకు తగిన సహాయం అందించాలని విన్నవించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో రెండేళ్లు పొడిగించాలని నిర్మలాసీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. అమరావతి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లేందుకు కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరారు. రాబోయే ఐదేళ్లు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవటంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. కేంద్ర సహకారంతోనే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

