CBN: తెలుగు జాతిని నెంబర్ వన్ చేస్తా

CBN: తెలుగు జాతిని నెంబర్ వన్ చేస్తా
X
ప్రపంచంలో మనకి తిరుగేలేదన్న సీఎం.. దుబాయ్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. భారీగా తరలివచ్చిన ప్రవాసాంధ్రులు.. మాతృభూమిని మరువద్దంటూ సీఎం సూచన

యూఏఈ పర్య­ట­న­లో ఉన్న ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, గల్ఫ్ దే­శా­ల్లో­ని తె­లు­గు ప్ర­జ­ల­తో ఆత్మీ­యం­గా సమా­వే­శ­మ­య్యా­రు. తన పర్య­ట­న­లో చి­వ­రి కా­ర్య­క్ర­మం­గా దు­బా­య్‌­లో­ని లీ మె­రి­డి­య­న్ హో­ట­ల్‌­లో ఏర్పా­టు చే­సిన ‘తె­లు­గు డయా­స్పో­రా’ సద­స్సు­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి అనూ­హ్య స్పం­దన లభిం­చిం­ది. యూఏఈ, సౌదీ అరే­బి­యా, కు­వై­ట్, ఓమన్, బహ్రె­యి­న్, ఖతా­ర్ వంటి గల్ఫ్ దే­శాల నుం­చి ప్ర­వా­సాం­ధ్రు­లు, తె­లు­గు ప్ర­జ­లు భారీ సం­ఖ్య­లో తర­లి­వ­చ్చి తమ అభి­మా­నా­న్ని చా­టు­కు­న్నా­రు. ఈ సభకు మం­త్రు­లు టీజీ భరత్, బీసీ జనా­ర్ధ­న్ రె­డ్డి, ఏపీ ఎన్నా­ర్టీ చై­ర్మ­న్ వే­మూ­రి రవి తది­త­రు­లు హా­జ­ర­య్యా­రు.

అత్యంత ఉత్సా­హ­భ­రిత వా­తా­వ­ర­ణం­లో జరి­గిన ఈ కా­ర్య­క్ర­మం­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ప్ర­సం­గిం­చా­రు. "ప్ర­పం­చం­లో తె­లు­గు జా­తి­కి తి­రు­గే లేదు. ప్ర­పం­చం­లో తె­లు­గు జా­తి­ని నెం­బ­ర్ వన్ గా ని­ల­బె­ట్ట­డ­మే నా లక్ష్యం. ప్ర­పం­చం­లో ఏ మూ­ల­కు వె­ళ్లి­నా తె­లు­గు­వా­రు ఉన్నత స్థా­యి­లో ఉం­డా­ల­ని నేను మన­స్ఫూ­ర్తి­గా ఆకాం­క్షి­స్తు­న్నా­ను" అని అన్నా­రు. తె­లు­గు జా­తి­కి తి­రు­గే లే­ద­ని, ప్ర­పం­చం­లో తె­లు­గు జాతి నెం­బ­ర్ 1గా తయా­ర­వు­తుం­ద­న్నా­రు. ప్ర­పం­చం­లో ఎక్క­డ­కు వె­ళ్లి­నా తె­లు­గు ప్ర­జ­లు ఉన్నత స్థా­యి­లో ఉం­డా­ల­ని ఆకాం­క్షిం­చా­న­ని సీఎం తె­లి­పా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అభి­వృ­ద్ధి­కి తన వద్ద స్ప­ష్ట­మైన ప్ర­ణా­ళిక ఉం­ద­ని చం­ద్ర­బా­బు వి­వ­రిం­చా­రు.

గ్లోబల్‌ లీడర్లుగా తెలుగు ప్రజలు

‘ప్ర­పం­చం­లో ఎక్క­డి­కి వె­ళ్లి­నా తె­లు­గు ప్ర­జ­లు ఉన్న­త­స్థా­యి­లో ఉం­డా­ల­ని ఆకాం­క్షిం­చా. జన్మ­భూ­మి­ని.. కర్మ­భూ­మి­ని ఎప్పు­డూ మీరు మర­వ­ద్దు. యూ­ఏ­ఈ­లో ఎక్క­డి­కి వె­ళ్లి­నా తె­లు­గు­వా­రం­టే మంచి అభి­ప్రా­యం కని­పిం­చిం­ది. దు­బా­య్‌­లో ఏ కా­ర్యా­ల­యా­ని­కి వె­ళ్లి­నా తె­లు­గు­వా­రు ఉన్న­త­స్థా­నా­ల్లో కని­పిం­చా­రు. గ్లో­బ­ల్‌ లీ­డ­ర్ల స్థా­యి­కి చే­రా­రు. అంతా జన్మ­భూ­మి రుణం తీ­ర్చు­కో­వా­ల్సిన అవ­స­రం ఉంది. పా­తి­కే­ళ్ల క్రి­తం ప్ర­తి ఇం­టి­కీ ఒక ఐటీ ప్రొ­ఫె­ష­న­ల్‌­ను తయా­రు­చే­యా­ల­ని చె­ప్పా. మై­క్రో­సా­ఫ్ట్‌­ను హై­ద­రా­బా­ద్‌­కు తీ­సు­కొ­స్తే.. అం­దు­లో ఉద్యో­గి­గా చే­రిన సత్య నా­దె­ళ్ల ఇప్పు­డు అదే సం­స్థ­కు సీ­ఈ­వో­గా ఉన్నా­రు’ సీఎం చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. ’30 ఏళ్ల ముం­దు ఐటీ­ని ప్రో­త్స­హిం­చా­ను. తె­లు­గు వా­ళ్లు ఐటీ ని­పు­ణు­లు­గా ఇప్పు­డు ప్ర­పం­చం అంతా రా­ణి­స్తు­న్నా­రు. సత్య­నా­దె­ళ్ల లాం­టి తె­లు­గు వా­ళ్లు మై­క్రో­సా­ఫ్ట్ కం­పె­నీ సీ­ఈ­ఓ­గా ఉన్నా­రు. 2024 ఎన్ని­క­ల్లో కూ­ట­మి కోసం ప్ర­వా­సాం­ధ్రు­లం­తా తపిం­చి గె­లి­పిం­చా­రు. గల్ఫ్ దే­శాల నుం­చి మీరు తర­లి­వ­చ్చి తె­లు­గు డయా­స్పో­రా­కు హా­జ­రు కా­వ­టం ఆనం­దా­న్ని కలి­గి­స్తోం­ది. అబు­దా­బీ, దు­బా­య్ ఆయి­ల్ ఎకా­న­మీ నుం­చి పర్యా­ట­కం, నా­లె­డ్జి ఎకా­న­మీ ది­శ­గా నడు­స్తు­న్నా­యి. 1.50 లక్షల హో­ట­ల్ రూ­ము­ల­తో ఆతి­థ్య రం­గా­ని­కి పె­ద్ద ఎత్తున ఆదా­యా­న్ని ఆర్జిం­చి పె­డు­తోం­ది’ అని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags

Next Story